E-Paper
Advertisement

Family Star Final Review: ఐరన్ వంచలేదు మావా.. గట్టిగా దించాడు..?

Family Star Final Review: ఐరన్ వంచలేదు మావా.. గట్టిగా దించాడు..?
Advertisement
Vijay Devarakonda's Family Star Fingal Review
Vijay Devarakonda’s Family Star Fingal Review

Vijay Devarakonda’s Family Star Final Review: ది దేవరకొండ విజయ్, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి ఫ్యామిలీ స్టార్ పై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతగోవిందం కాంబో రిపీట్ కావడమే.

ఇక ఇందులో విజయ్ సరసన మృణాల్ నటిస్తోంది అనగానే సినిమాపై అంచనాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కూడా ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అనుకున్నారు. కానీ, ఈ సినిమా మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. కొంతమంది సినిమా బావుంది.. చూడొచ్చు అని చెప్తుండగా.. మరికొంతమంది మాత్రం ఐరన్ వంచలేదు మావా.. గట్టిగా దించాడు..? అంటూ పెదవి విరుస్తున్నారు.

Advertisement

అసలు విజయ్ ఫ్యామిలీ స్టార్ కథ ఏంటి అంటే.. గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇద్దరు అన్నలు, వదినలు, బామ్మ, పిల్లలతో నివసిస్తుంటాడు. అన్నలిద్దరూ ఏ పని చేయకుండా తిరుగుతుంటే.. చిన్న కొడుకు గోవర్ధన్ మాత్రమే ఇంటిని చూసుకుంటూ ఉంటాడు. ఇక ఈ నేపథ్యంలోనే వారి ఇంటిపైకి ఇందు(మృణాల్ ఠాకూర్) అద్దెకు వస్తుంది. మొదటి నుంచి ఆమెతో ప్రేమలో పడకూడదు అనుకుంటూనే గోవర్ధన్ ఆమె ప్రేమలో పడతాడు. ఇక అక్కడనుంచి అతని లైఫ్ మారిపోతుంది. అసలు ఇందు ఎవరు.. ? ఆమె వచ్చాక గోవర్ధన్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది.. ? అనేది కథ.

Also Read: Family Star: విజయ్ కన్నా ముందు ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న హీరో ఎవరో తెలుసా.. ?

Advertisement

ఫ్యామిలీస్టార్ ను గీతగోవిందంతో పోల్చలేమని అభిమానులు అంటున్నారు. చాలా లాజిక్ లేని సీన్స్, లాగ్ సీన్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది అయితే నిద్రపోయామని, సర్కారువారి పాట కన్నా దారుణమని అంటున్నారు. ఇక ఇవన్నీ కాకుండా విజయ్ పై కొంతమంది కావాలనే నెగెటివ్ టాక్ ను తెస్తున్నారని, సినిమా బావుందని అంటున్నారు. ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. కలక్షన్స్ విషయంలో రికార్డులు సృష్టించొచ్చు అనేది కొందరి మాట. మరి ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×