E-Paper
Advertisement

Vijay Devarakonda: లవ్ మ్యారేజ్..ఆమెనే చేసుకుంటా.. కానీ..

Vijay Devarakonda: లవ్ మ్యారేజ్..ఆమెనే చేసుకుంటా.. కానీ..
Advertisement

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమా కన్నా ఎక్కువగా అతడు ప్రమోషన్స్ ఎలా చేస్తున్నాడు అనేదే అభిమానులు చూస్తారు. టాలీవుడ్ లో డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేయడంలో విజయ్ తరువాతనే ఎవరైనా అని చెప్పొచ్చు. ప్రస్తుతం విజయ్.. ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన విజయ్.. అన్ని స్టేట్స్ ను కవర్ చేస్తున్నాడు.

Advertisement

ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో విజయ్.. రిపోర్టర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పాడు.  టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇంటర్వ్యూ కి వెళ్ళినా కూడా మొట్టమొదట అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు..? అనే. ఇప్పుడు చెన్నైలో కూడా రిపోర్టర్ అదే ప్రశ్న అడిగాడు. ఈ ఇయర్ పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు విజయ్.. ఖచ్చితంగా పెళ్లి  చేసుకుంటాను.. నాక్కూడా పిల్లలను కనాలని ఉంది.. కానీ ఈ ఏడాది కాదు అని సమాధానం ఇచ్చాడు. లవ్ మ్యారేజ్ నా అన్న ప్రశ్నకు  తడుముకోకుండా  విజయ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటాను.. కానీ ఆ అమ్మాయి మా ఇంట్లో వాళ్లకు నచ్చాలి అన్నాడు.

ఇంకా ఇది కాకుండా తనకు ఇష్టమైన హీరోయిన్స్ గురించి చెప్పమంటే రష్మిక గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమాధానాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక విజయ్ లవ్ మ్యారేజ్ అనగానే అందరూ రష్మిక తోనే  లవ్ లో ఉన్నాడు కదా ఆమెనే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యనే రష్మిక సైతం తనకు విజయ్ లాంటి భర్త కావాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో విజయ్ కూడా లవ్ మ్యారేజ్ అని అంటున్నాడు, దీంతో  వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని ఇంకోసారి అభిమానులు గుసగుసలాడుతున్నారు. మరి త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్తుందేమో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×