Big Stories

Bengaluru Cafe Blast: రామేశ్వరం కేఫ్ బాంబు దాడి.. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షలు

 

- Advertisement -

- Advertisement -

Bengaluru Cafe Blast: బెంగుళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కేఫ్ బాంబు దాడిలో ఇద్దరు నిందితులు పాల్గొన్నట్లు అనుమానిస్తోంది. ఆ ఇద్దరి నిందితుల ఆచూకి తెలిపిన వారికి రివార్డ్ అందిస్తున్నట్లు ప్రకటించింది.

బెంగుళూరు బ్రూక్ ఫీల్డ్ లోని రామేశ్వరం కేఫ్ నిందితుల ఆచూకి తెలిపిన వారికి NIA రూ.20 లక్షల రివార్డును అందిస్తామని ప్రకటన చేసింది. ఇద్దరి నిందితుల ఫోటోలను విడుదల చేసింది. వారిలో ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున ఇద్దరికి రూ.20 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు NIA తెలిపింది. ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా వెల్లడించింది.

మార్చి 1వ తేదీనా ప్రశాంతంగా ఉన్న బెంగుళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్ లో ఒక్కసారిగా బాంబు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్ లను NIA ప్రధాన నిందితులుగా అనుమానిస్తోంది. అక్కడ దొరికిన ఆధారాలు బట్టి షాజీబ్ కేఫ్ లో బాంబు అమర్చినట్లు NIA అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే ఈ బాంబు దాడికి పాల్పడినట్లు NIA అనుమానిస్తున్న ఈ నిందితులిద్దరూ.. 2020 ఉగ్రదాడి కేసులోనూ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు. వీరి గురించి ఎవరైన సమాచారం అందించాలనుకుంటే info.blr.nia@gov.in కు మెయిల్ చేయాలని NIA కోరింది.

Also Read: Sunita Kejriwal: కేజ్రీవాల్‌‌కు మద్దతుగా ప్రచారం.. వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన సతీమణి

ఈ కేసులో NIA అధికారులు ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కీలక కుట్రదారుగా అనుమానిస్తోన్న ముజమ్మిల్ షరీఫ్ ను గురువారం NIA అధికారులు అరెస్ట్ చేశారు. షరీఫ్ ఈ బాంబు దాడికి అవసరమైన పేలుడు పదార్థాలు, పరికరాలను సమకూర్చినట్లుగా NIA భావిస్తోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న డిజిటల్ పరికరాలు, నగదును NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News