E-Paper
Advertisement

Sai Pallavi: రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండతో లవ్‌లో పడబోతున్న సాయి పల్లవి..!

Sai Pallavi: రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండతో లవ్‌లో పడబోతున్న సాయి పల్లవి..!
Advertisement

Sai Pallavi – Vijay Devarakonda: ‘భాగమతి ఒక్కటే పీస్’ డైలాగ్‌తో సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది నటి సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నాగ చైతన్య, వరుణ్ తేజ్, శర్వానంద్‌ వంటి హీరోల సరసన నటించి అదరగొట్టేసింది.

ముఖ్యంగా ఈ అమ్మడు యాక్టింగ్, డ్యాన్స్‌కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోతుంది. కొరియోగ్రాఫర్లకు సైతం డ్యాన్స్‌తో చెమటలు పట్టిస్తుంది. ఎలాంటి స్టెప్‌నైనా పిప్పి పిండి చేస్తుంది. అయితే యాక్టింగ్, డ్యాన్స్ కోసం వచ్చే ఫ్యాన్స్ కంటే బోల్డ్ కంటెంట్‌లకు దూరంగా ఉండటంతో మరింత మంది ఫ్యాన్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Advertisement

ఇదిలా ఉంటే సాయి పల్లవి నటించే సినిమాలలో ఎక్కువగా లవ్ మూవీసే ఉంటాయి. ఆమె ఎక్కువగా మాస్, రొమాంటిక్ సినిమాల జోలికి పోదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొక లవ్ మూవీలో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఓ లవ్ మూవీలో నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తే నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: అమీర్ ఖాన్ కొడుకుతో సాయి పల్లవి.. వైరల్ అవుతున్న ఫొటోలు!

Advertisement

విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇది ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అందువల్లనే ఈ మూవీలో విజయ్‌కు జోడీగా సాయి పల్లవి అయితేనే బాగుంటుందని మేకర్స్ భావించారట.

ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో సాయి పల్లవి నటించేందుకు రెడీగా ఉన్నట్లు వినికిడి. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి కానీ, అటు సాయి పల్లవి నుంచి కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×