Sai Pallavi with Aamir Khan Son Pics goes viral: సినిమాలలో ఎలాంటి పాత్రలో అయినా.. పరకాయ ప్రవేశం చేయగలిగే హీరోయిన్ సాయి పల్లవి. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుని అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవలే తన చెల్లెలి పెళ్లి చేసిన ఈ బ్యూటీ.. తాజాగా జపాన్‌లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకుతో కలిసి కెమెరా కంట పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ పాత్రలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. తన అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
కేవలం కంటెంట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగానే తన వద్దకు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినా.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్ముహమాటంగా నో చెప్పేస్తోంది. ఇప్పటికే తనవద్దకు వచ్చిన ఎన్నో స్టోరీలను రిజక్ట్ చేసేసింది.
Read More: సాయి పల్లవి ఇన్ని సినిమాలను రిజక్ట్ చేసిందా?.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..
అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అజిత్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా.. అందులో తన పాత్రకు ప్రాధాన్యత లేదనే కారణంతో ఈ సినిమాలన్నింటినీ వద్దునుకుందట. అంతేకాకుండా. ఈ సినిమాలలో కొన్ని ముద్దు సీన్లు ఉండటం వల్ల కూడా రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది.
ఇక సినిమాల విషయంలో మాత్రం సాయి పల్లవి ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ భామ ఓ హీరోతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్ హీరో నాగచైతన్యతో ‘తండేల్’ మూవీ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఆమె పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ మూవీతో పాటు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి మరో మూవీ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకుతో కలిసి జపాన్‌లో దర్శనమిచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అనంతరం పూర్తి వివరాలు తెలిసి హమ్మయ్య అని అనుకుంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో ఓ హిందీ సినిమాకి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జపాన్లో జరుగుతుండటంతో.. అక్కడ సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు లీకయ్యాయి. దాంతోపాటు ప్రస్తుతం అక్కడ సపరో స్నో ఫెస్టివల్ జరుగుతుంది. ఈ వేడుకను మూవీ యూనిట్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే జునైద్ ఖాన్, సాయి పల్లవి కలిసి తీసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.