BigTV English

Vijay Mallya: ఎన్టీఆర్ హీరోయిన్‌కు లిక్కర్ కింగ్ కన్యాదానం.. సమీరాకు మాల్య ఏమవుతారు?

Vijay Mallya: ఎన్టీఆర్ హీరోయిన్‌కు లిక్కర్ కింగ్ కన్యాదానం.. సమీరాకు మాల్య ఏమవుతారు?

Vijay Mallya:   లిక్కర్ కింగ్ గా పేరు సంపాదించుకున్న విజయ్ మాల్యా(Vijay Mallya) ఇక్కడ బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున అప్పులు తీసుకొని ఆ డబ్బు కట్టకుండా విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇక ఈయన విదేశాలలో ఉన్నప్పటికీ కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో ఆర్సీబీ గెలవడంతో లండన్ లోని సంబరాలు చేసుకుంటూ వార్తల్లో నిలిచారు.. ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే విజయ్ మాల్యాకు సంబంధించి తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈయన ఒక హీరోయిన్ కు ఏకంగా కన్యాదానం(Kanyadanam) చేస్తూ పెళ్లి జరిపించారనే విషయం బయటకు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి విజయ్ మాల్యా పెళ్లి జరిపించిన హీరోయిన్ ఎవరు? ఎందుకు కన్యాదానం చేయాల్సి వచ్చింది? అనే విషయానికి వస్తే…


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమీరారెడ్డి (Sameera Reddy) ఒకరు. ఈమె తెలుగులో ఎన్టీఆర్ (NTR)తో కలిసి అశోక్, నరసింహుడు వంటి సినిమాలలో నటించారు. అదేవిధంగా చిరంజీవితో కలిసి జై చిరంజీవ అనే సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇకపోతే ఈమె ఎన్టీఆర్ తో కలిసి ఒకేసారి రెండు సినిమాలు చేయడంతో అప్పట్లో వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్లు వినిపించడంతో అందరూ నిజమేనని భావించారు.

ఎన్టీఆర్ తో ప్రేమ వ్యవహారం…


ఎన్టీఆర్ తో ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వార్తలను ఈమె ఖండిస్తూ… మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ లేదని, ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉందని ఈ వార్తలను కొట్టి పారేశారు. ఇక ఈమె తెలుగు సినిమాలలో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడం, సినిమా అవకాశాలు కూడా తగ్గటంతో బాలీవుడ్ బాట పట్టారు.‘మైనే దిల్‌ తుజ్కో దియా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్కడ కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈమె 2014లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది.

కన్యాదానం చేసిన విజయ్ మాల్యా…

ప్రస్తుతం తన భర్త పిల్లలతో ఎంత సంతోషంగా గడుపుతున్న సమీరా రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన పెళ్లి గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలియజేశారు.. 2014 సంవత్సరంలో నా పెళ్లిని చాలా సింపుల్ గా మరాఠీ సాంప్రదాయాల ప్రకారం చేసుకున్నానని తెలిపారు. అయితే పెళ్లి సమయంలో నాకు విజయ్ మాల్యా కన్యాదానం చేశారని తెలిపారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో తన తల్లి బంధువు అయిన విజయ్ మాల్యా తన పెళ్లిలో వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసినట్లు ఈమె తెలియజేశారు. ఇలా విజయ్ మాల్యా నటి సమీరా రెడ్డికి బంధువు అవుతారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడు కాళ్లు కడిగి కన్య దానం చేయడం అనేది ఒక సాంప్రదాయం. తన పెళ్లిలో మాత్రం ఈ సాంప్రదాయాన్ని విజయ్ మాల్యా నిర్వహించారనే విషయాన్ని ఈమె బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×