BigTV English

Vijay Thalapathy latest news : సినిమాలకు దూరంగా విజయ్.. రాజకీయాల కోసమే..

Vijay Thalapathy latest news : సినిమాలకు దూరంగా విజయ్.. రాజకీయాల కోసమే..
Advertisement
Vijay Thalapathy


Vijay Thalapathy latest news : సినిమాలు, రాజకీయం అనేవి ఎప్పుడూ పక్కపక్కనే నడుస్తుంటాయి. వెండితెరపై కనిపించి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంకంటే ప్రజల్లో కలిసిపోయి వారికి సేవ చేయడం మేలు అని ఇప్పటికీ ఎంతోమంది నటీనటులు రాజకీయాల్లోకి దిగారు. అందులో చాలామంది సక్సెస్ అయ్యారు కూడా. కొంతమంది సినిమాలు, రాజకీయం.. రెండు మ్యానేజ్ చేస్తూ రెండు పడవలపై ప్రయాణం చేస్తుంటూ.. కొందరు మాత్రం రాజకీయాల కోసం సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. ఆ లిస్ట్‌లో విజయ్ కూడా చేరనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్‌లో కొందరు హీరోలకు ఉన్న ఫ్యాన్ బేస్ చూస్తుంటే.. ఈ భాషా పరిశ్రమలోనూ ఏ హీరోకు ఉండదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అందులో ఒకరు విజయ్. విజయ్ చేసే సినిమాలకు మాత్రమే కాదు.. తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్‌కు, సహాయం చేసే గుణానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే విజయ్ ఎప్పటినుండో రాజకీయాల్లో కాస్త యాక్టివ్‌గానే ఉంటాడు. కానీ ఆయన సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేస్తాడనే వార్త తాజాగా వైరల్ అవుతోంది.


ప్రస్తుతం విజయ్.. లోకేశ్ కనకరాజ్‌తో ‘లియో’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర నుండి షూటింగ్ వరకు అన్ని త్వరత్వరగా జరిగిపోతున్నాయి. అంతే కాకుండా అప్పుడే ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అయితే విజయ్.. లియో తర్వాత ఇక సినిమాల్లో నటించడనే విషయం ఫ్యాన్స్‌ను కాస్త నిరాశకు గురిచేస్తోంది. ఒకవేళ లియో తర్వాత కాకపోయినా.. విజయ్ ప్రస్తుతం రెండు, మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడని, దాని తర్వాత అయినా తన సినీ ప్రయాణానికి చెక్ పెట్టే అవకాశం ఉందని తమిళ మీడియా అంటోంది.

విజయ్ నటించిన సినిమా అంటే ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్. తన నటన కోసం, స్క్రీన్ ప్రెసెన్స్ కోసం మాత్రమే సినిమాలకు వెళ్లే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. తను పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నందుకు వారు కొంచెం సంతోషంగా ఉన్నా.. సినిమాలు మానేస్తున్నాడంటే మాత్రం నిరాశ పడుతున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా అనౌన్స్ చేసేవరకు నమ్మలేమని కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×