BigTV English

Varahi Puja Rules : వారాహి నవరాత్రి దీక్ష పూజ నియమాలు

Varahi Puja Rules : వారాహి నవరాత్రి దీక్ష పూజ నియమాలు
Advertisement

Varahi Puja Rules : వారాహి నవరాత్రి దీక్షలు చేసే వారి కొన్ని ఆహార నియమాలు పాటించాలంటోంది శాస్త్రం. 9 రోజలు పాటు ఊదయం , సాయంత్రం రెండు పూటలా పూజ చేయడంతో బ్రహ్మచర్యం పాటించాలి. దీక్షలో కూర్చున్న పది రోజులు మాంసానికి దూరంగా ఉండాలి. వెజిటేరిన్ పుడ్ మాత్రమే వండాలి, తీసుకోవాలి. ఏ పదార్ధాన్ని వండినా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే ప్రసాదంగా భుజించాలి. వీలైతే పది రోజులుపాటు అఖండ దీపం పెట్టుకుంటే మంచిది. ఆడవారు, మగవారు కూడా వారాహి పూజ ఇంట్లో నిర్వహించ వచ్చని పెద్దలు చెబుతున్నారు.


వారాహి పాడి పంటలకు , భూమికి సంబంధించిన పూజ కార్యక్రమం. మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు వేయాలి. ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచితే సరిగ్గా పదో రోజుకి మొలకలు బాగా మొలిస్తే మీ సంకల్పం నెరవేరినట్టు భావించాలి. తర్వాత వాటిని ఆవుకి తినిపించాలి .

పసుపు గణపతిని ప్రతి రోజూ చేసి పూజ చేయాలి. ఆ గణపతిని చేసిన పసుపు వాడుకోవాలి.


విగ్రహం ఉంటే రోజూ పసుపు జలంతో అభిషేకం చేయడం మంచిది. ఒక వేళ ఫోటో మాత్రమే ఉంటే రోజూ పువ్వులు వాడుకోవచ్చు.

విగ్రహం కానీ, ఫోటో కానీ లేని వారు ఇంట్లో ఏ అమ్మవారి రూపం ఉంటే ఆ తల్లి ఫోటో ముందు దీపాన్ని పెట్టి వారాహిగా దీపాన్ని ఆవాహన చేసుకోవచ్చు. యంత్ర పూజా విధానం తెలిసిన వారు మాత్రమే యంత్ర పూజను ప్రతీ రోజు ఆచరించాలి.

మధ్యాహ్నం భోజనం చేయవచ్చు సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేయాలి.

మీ శక్తి మేరకి నైవేద్యం పెట్టండి. అమ్మవారికి ప్రతీ రోజు బెల్లం పానకం పెట్టడం మంచిది. అమ్మవారికి బెల్లం పానకం అంటే ప్రీతి.

కోరికలతో పూజ చేసే వారు నవరాత్రులు నియమాలు పాటించాలి. పద్దతిగా ఉండాలి. వారాహి పూజలో ఉన్నప్పుడు ఎప్పుడూ నోటి నుంచి చెడు మాటలు రాకూడదు. వేరే మహిళలు, పురుషుల గురించి చెడు మాటలు రాకూడదు . చెడు ఆలోచనలో పూజలు పనికిరావనే సంగతి గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఏదైనా సమస్య వచ్చి దీక్ష మధ్యలో ఊరు వెళ్లాల్సి వస్తే ఆరోజు అమ్మకి పూజ చేసి సమస్య చెప్పి దండం పెట్టుకోవాలి. ఏకాగ్రతతో మనస్సు పెట్టి పూజ చేస్తే ఫలితాలు కళ్లారా చూడవచ్చని శాస్త్రం చెబుతోంది.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. సోమవారాలు పూజ ఎలా చేయాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. శివుడిని ఎలా పూజిస్తే మంచిది ?

God Idols: ఇలాంటి దేవుళ్ల.. విగ్రహాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు !

Diwali 2025: దీపావళి నాడు ఏమి చేయాలి? లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం ఏంటి ?

Diwali Vastu Tips: దీపావళి రోజు ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. డబ్బే డబ్బు

Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. పండగ రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి ?

Diwali 2025: దీపావళికి కొత్త వస్తువులు కొనొచ్చా ? ఈ రోజు పొరపాటున చేయకూడని పనులివే !

Diwali 2025 Upay: దీపావళి రోజు ఈ ఒక్కటి చేస్తే.. ఏడాదంతా సంపదకు లోటుండదు !

Big Stories

×