E-Paper
Advertisement

Vijayendra Prasad: రాజ‌మౌళికి మోదీ, స్పీల్ బ‌ర్గ్ ఒక‌టే చెప్పారు

Vijayendra Prasad: రాజ‌మౌళికి మోదీ, స్పీల్ బ‌ర్గ్ ఒక‌టే చెప్పారు
Advertisement

Vijayendra Prasad: రాజ‌మౌళికి మోదీ, స్పీల్ బ‌ర్గ్ ఒక‌టే చెప్పారు

ఇప్పుడు యావ‌త్ భార‌త‌దేశం గ‌ట్టిగా వినిపిస్తోన్న పేరు RRR. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ పీరియాడిక్ డ్రామాలోని నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావ‌ట‌మే అందుకు కార‌ణం. ఈ సక్సెస్ గురించి ఎంటైర్ యూనిట్ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఈ నేప‌థ్యంలో RRR మూవీ రైటర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ జ‌క్క‌న్న గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అది కూడా మోదీ, స్పీల్ బ‌ర్గ్‌ల‌కు కనెక్ష‌న్ పెడుతూ. అస‌లు విజ‌యేంద్ర ప్ర‌సాద్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి మాట్లాడుతూ ‘‘కొన్ని రోజుల ముందు ప్రధాన నరేంద్ర మోదీని కలిశాను. నాలుగు నిమిషాల పాటు చర్చ సాగుతుందనుకుంటే 40 నిమిషాల వరకు సాగింది. భారతదేశ సంస్కృతి చాలా గొప్ప‌దని దాన్ని చాటేలా చేయాల‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న విజ‌న్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను.

Advertisement

స్పీల్‌బ‌ర్గ్‌ను రాజ‌మౌళి క‌లిసిన‌ప్పుడు కూడా ఆయ‌న ఇదే చెప్పారు. భార‌తీయ‌త‌ను చాటి చెప్పేలా సినిమాల‌ను రూపొందించాల‌ని చెప్పారని తెలిపారు. అలాగే RRR సినిమా స‌క్సెస్‌లో మూడు త‌రాల స‌క్సెస్ ఉంద‌ని అన్నారు. రైట‌ర్స్‌గా శివ శ‌క్తి ద‌త్తా, విజ‌యేంద్ర ప్ర‌సాద్ ప‌ని చేస్తే, రాజ‌మౌళి తెర‌కెక్కించార‌ని.. కీర‌వాణి, కార్తికేయ‌, కాల‌భైర‌వ వంటి వారి కృషి కూడా ఎంతో ఉంద‌ని ఆయ‌న ఇదే ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

వందేళ్ల భార‌తీయ సినీ చ‌రిత్రలో తొలి ఆస్కార్ అందుకున్న చిత్రంగా RRR రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదొక ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. ఇందులో నాటు నాటు సాంగ్‌కి ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ఆస్కార్ అవార్డ్ వ‌చ్చింది. ఈ చిత్రానికి ఎం.ఎం.కీర‌వాణి సంగీతాన్ని అందించ‌గా.. రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ పాట‌ను పాడారు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ త‌మ డాన్సింగ్ స్కిల్స్‌తో దుమ్ము దులిపారు. ఇప్పుడిదే పాట‌ను ఆస్కార్ మ‌న ఇండియాకు తీసుకొచ్చింది.

Advertisement

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వివాదం.. చిరంజీవికి హైకోర్టు ఆదేశాలు

for more updates follow this link:-bigtv

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×