E-Paper
Advertisement

Vikram: విజయవాడలో విక్రమ్ సందడి.. హోటల్ కు వెళ్లి టిఫిన్ చేస్తూ..

Vikram: విజయవాడలో విక్రమ్ సందడి.. హోటల్ కు వెళ్లి టిఫిన్ చేస్తూ..
Advertisement

Vikram:విజయవాడలో తంగలాన్ టీమ్ సందడి చేసింది. హీరో విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహనన్ విజయవాడ బాబాయ్ హోటల్ లో సందడి చేశారు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఇంకోపక్క విక్రమ్.. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నాడు. ఈ మధ్యనే బెంగుళూరు వెళ్లిన విక్రమ్.. అక్కడ కాంతార హీరో రిషబ్ శెట్టిని కలిసిన విషయం తెల్సిందే.

Advertisement

ఇక తాజాగా విక్రమ్ ఏపీకి వెళ్ళాడు. విజయవాడలోని ఫేమస్ బాబాయ్ హోటల్ లో టిఫిన్ చేస్తూ కనిపించాడు. విక్రమ్, మాళవిక టిఫిన్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక విజయవాడకు విక్రమ్ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు.. బాబాయ్ హోటల్ కు క్యూ కట్టారు. వారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విక్రమ్ కెరీర్ కు ఈ సినిమా హిట్ కావడం చాలా ముఖ్యం. తంగలాన్ కోసం విక్రమ్ చాలా కష్టపడ్డాడు. ఇక ఆగస్టు 15 న తంగలాన్ కు గట్టి పోటీనే ఉంది. ఒకపక్క డబుల్ ఇస్మార్ట్.. ఇంకోపక్క మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి ఈ హీరోలను దాటుకొని విక్రమ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×