BigTV English

Realme C63 5G: వారెవ్వా బహుత్ అచ్చా.. రూ.11 వేలకే 5జీ ఫోన్ లాంచ్.. ఈ తగ్గింపుతో మరింత తక్కువకే..!

Realme C63 5G: వారెవ్వా బహుత్ అచ్చా.. రూ.11 వేలకే 5జీ ఫోన్ లాంచ్.. ఈ తగ్గింపుతో మరింత తక్కువకే..!

realme C63 5G Launched: ఎన్నో స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలో తీసుకొచ్చి ఫోన్ ప్రియులను ఆకట్టుకున్న ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ Realme తాజాగా మరొక చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసింది. అదే realme C63 5G ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. Realme C63 5G గరిష్టంగా 8 GB RAMని కలిగి ఉంది. దీని RAMను వర్చువల్‌గా విస్తరించుకోవచ్చు. ఇది 5000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడింది. అంతేకాకుండా ఇది తాజా Android 14 పై రన్ అవుతుంది.


realme C63 5G price 

realme C63 5G స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్‌లలో వచ్చాయి. అవి స్టార్రి గోల్డ్, ఫారెస్ట్ గ్రీన్. కాగా ఇది మూడు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. అందులో 4GB+128GB వేరియంట్ ధర రూ.10999గా నిర్ణయించింది. అయితే దీనిపై రూ. 1000 బ్యాంక్ పొందొచ్చు. ఆ తర్వాత ఇది రూ. 9999కే లభిస్తుంది. అదేవిధంగా 6GB + 128GB వేరియంట్ ధర రూ. 11999, అలాగే 8GB + 128GB వేరియంట్ ధర రూ.12999గా కంపెనీ నిర్ణయించింది. వీటిపై కూడా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. మొదటి సేల్ ఆగస్ట్ 20న ప్రారంభం అవుతుంది. దీనిని realme.com, Flipkartలో కొనుక్కోవచ్చు.


Also Read: ఇవాళే లాస్ట్.. సామ్‌సంగ్, రియల్‌మి, వన్‌ప్లస్ 5జీ ఫోన్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్లు..!

realme C63 5G Specifications

realme C63 5G ఫోన్ 6.67-అంగుళాల (1604 x 720 పిక్సెల్‌లు) HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. దీని గరిష్ట బైట్‌నెస్ 625 నిట్‌లు. MediaTek Dimension 6300 ప్రాసెసర్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశారు. ఇది గరిష్టంగా 8 GB LPDDR4x RAM + 128 GB స్టోరేజ్‌తో వస్తుంది. SD కార్డ్‌తో స్టోరేజీని 2TB వరకు పెంచుకోవచ్చు.

Realme C63 5G సరికొత్త ఆండ్రాయిడ్ 14పై నడుస్తుంది. ఇది Realme UI 5.0తో లేయర్ చేయబడింది. ఇందులో 32MP వెనుక కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇతర ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్ ఉన్నాయి. realme C63 5G ఫోన్ IP64 రేట్ చేయబడింది. అంటే వాటర్ అండ్ డస్ట్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించగలదు. ఇది 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Big Stories

×