E-Paper
Advertisement

Vishal: వాటి గురించి మాట్లాడితే యాసిడ్ పోస్తామని బెదిరించారు.. మా అమ్మ ఏం చెప్పిందంటే..?

Vishal: వాటి గురించి మాట్లాడితే యాసిడ్ పోస్తామని బెదిరించారు.. మా అమ్మ ఏం చెప్పిందంటే..?
Advertisement

Vishal: కోలీవుడ్ హీరో విశాల్ ఏది మాట్లాడినా వివాదమే. తన సినిమా రిలీజ్ అవుతున్న ప్రతిసారి ఆయన ఏదో ఒక కాంట్రవర్సీతో మీడియా ముందుకు వస్తాడు. గత కొన్నిరోజుల నుంచి విశాల్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఆయన నటించిన తాజా చిత్రం రత్నం. సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తెలుగు, తమిళ్ తేడా లేకుండా విశాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా కన్నా ఎక్కువ పాలిటిక్స్ గురించే మాట్లాడుతూ హీట్ పుట్టిస్తున్నాడు.

తాజాగా తెలుగులో ప్రెస్ మీట్ పెట్టిన విశాల్.. తనను కాంట్రవర్సీ విశాల్ అని పిలవడంపై స్పందించాడు. “ఏ వ్యక్తి మన వరకు తిన్నామా.. పడుకున్నామా.. సంపాదించుకున్నామా.. మనం హ్యాపీగా ఉన్నామా అని ఉండి ఉంటే.. నేను అడిగిన కాంట్రవర్షియల్ ప్రశ్నలు కాకుండా వేరే ప్రశ్నలు వచ్చేవి. ఈ సమాజంలో ఏదైనా తప్పు జరిగితే అడిగే హక్కు నాకు ఉంది. ఓటు వేసినందుకు కాదు. నేను ట్యాక్స్ కడుతున్నాను. తమిళనాడులో ఘోరాతి ఘోరంగా డబుల్ ట్యాక్సియేషన్ నడుస్తోంది. ఎవరికి ధైర్యం లేదు మాట్లాడడానికి. ఈ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా మా మోడీ గారికి, తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై గారికి కోరిక పెట్టుకుంటున్నాను. ఎలా అండీ ఊరుకుంటున్నారు.. ప్రైమ్ మినిస్టర్ మోడీ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ అన్నప్పుడు.. తమిళనాడులో మాత్రం రెండు ట్యాక్స్ లు ఎందుకు కట్టాలి..? అది నేను అడిగితే కాంట్రవర్సీ అంటున్నారు.

Advertisement

నేను అడిగేది నిజం అంటే.. ఎప్పుడు నేను కాంట్రవర్సీ విశాల్ గానే ఉంటాను. నాకు పెళ్లాం .. పిల్లలు లేరు.. వేరేవాళ్లకు వాళ్ళు ఉన్నారు ఆ భయంతోనే వాళ్లు మాట్లాడడం లేదు. ఎవరో పొలిటికల్ గ్యాంగ్ కొందరు మా అమ్మకు కాల్ చేసి.. మీ అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు.. ఆపేయమని చెప్పండి.. లేకపోతే యాసిడ్ పోసేస్తాం అని చెప్పారట. దానికి మా అమ్మ.. మా అబ్బాయి సాయంత్రం ఇంటిదగ్గర ఉంటాడు. అడ్రెస్స్ పంపిస్తాను.. వచ్చి ఏం కావాలంటే అది చేయండి అని చెప్పింది. అలాంటి తల్లిదండ్రులకు పుట్టినవాడిని. నాకు వాళ్ళందరూ నలుగురికి మంచి చేయాలి అని చెప్పారు. అదే నేను ఫాలో అవుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×