E-Paper
Advertisement

Vishwak Sen – Anudeep: ‘జాతి రత్నాలు’ డైరెక్టర్‌తో విశ్వక్ కొత్త సినిమా.. కామెడీ ఎట్లుంటదో మరి..!

Vishwak Sen – Anudeep: ‘జాతి రత్నాలు’ డైరెక్టర్‌తో విశ్వక్ కొత్త సినిమా.. కామెడీ ఎట్లుంటదో మరి..!
Advertisement

Vishwak Sen – Anudeep: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చిన మంచి హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో ‘గామి’ ఒకటి. ఎన్నో ఏళ్లనుంచి షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ సినిమా చివరికి రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది. దీని తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

ఇక ఇదే జోష్‌లో విశ్వక్ మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి ‘మెకానిక్ రాకీ’ ఒకటి. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. తేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. అందరిలోనూ క్యూరియోసిటీ పెంచేసింది.

Advertisement

ఇక ఈ మూవీతో పాటు ‘లైలా’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఇందులో విశ్వక్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఎన్నడూ చూడని లేడీ గెటప్‌లో దుమ్ముదులిపేయనున్నాడు. అందుకు సంబంధించి ఇటీవల ఓ ప్రీ లుక్ కూడా బయటకొచ్చింది. అందులో లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ ఫేస్‌ను చిన్నగా రివీల్ చేశారు. కాగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2025 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Also Read: మెకానిక్ రాకీగా విశ్వక్ సేన్.. కొత్త మూవీ పోస్టర్ భలే ఉంది కదా

Advertisement

ఇదిలా ఉంటే విశ్వక్ ఇప్పుడు మరో సినిమాను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి ‘జాతిరత్నాలు’ ఫేం కేవీ అనుదీప్‌తో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ మేరకు దర్శకుడు అనుదీప్ చెప్పిన కథకు విశ్వక్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక అన్ని సెట్ అయితే త్వరలోనే వీరి కాంబోపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కాగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసి వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంతవరకు మాస్‌ యాక్షన్ కాన్సెప్టులతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన విశ్వక్ ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌తో అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి విశ్వక్ అండ్ అనుదీప్ పంచ్‌లు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తాయో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×