E-Paper
Advertisement

Mechanic Rocky – Vishwak Sen: మెకానిక్ రాకీగా విశ్వక్ సేన్.. కొత్త మూవీ పోస్టర్ భలే ఉంది కదా

Mechanic Rocky – Vishwak Sen: మెకానిక్ రాకీగా విశ్వక్ సేన్.. కొత్త మూవీ పోస్టర్ భలే ఉంది కదా
Advertisement
Mechanic Rocky
Mechanic Rocky

Mechanic Rocky – Vishwak Sen: సినీ అభిమానులెప్పుడూ.. తమ అభిమాన హీరో బర్త్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆ రోజునే కదా.. తమ హీరో చేయబోయే సినిమాలు అనౌన్స్ అవుతాయి. అయితే ఇటీవలే మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే రాగా.. ఆ రోజు పలు సినిమాలు అనౌన్స్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ వంతు వచ్చింది. ఈ రోజు విశ్వక్ సేన్ బర్త్ డే. ఈ సందర్భంగా అతడు నటిస్తున్న.. నటించబోయే సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్‌లు విడుదల కానున్నాయి. దీని కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన కొత్త సినిమాను ప్రకటించాడు.

Advertisement

ఇటీవలే గామి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విశ్వక్. అదే జోష్‌లో ఇప్పుడు మరొక కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నేడు అతడి బర్త్ డే కావడంతో ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ఈ చిత్రానికి గానూ ‘మెకానిక్ రాకీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Also Read: విశ్వక్‌సేన్‌ బర్త్‌ డే స్పెషల్‌.. ఈ రోజు రాబోతున్న కొత్త సినిమా అప్డేట్లు ఇవే..

Advertisement

ఈ మేరకు ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విశ్వక్ రెంచ్ పట్టుకొని ఊరమాస్ లుక్‌లో సిగరెట్ కాల్చుతూ కనబడుతున్నాడు. ఈ చిత్రానికి రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

కామెడీ, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ మూవీ విశ్వక్ సేన్ కెరీర్‌లో 10వ చిత్రంగా రూపొందుతోంది. ఇకపోతే జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే డిఓపీగా మనోజ్ కాటసాని, ఎడిటర్‌గా అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా క్రాంతి ప్రియం, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా సత్యం రాజేష్, విద్యా సాగర్‌లు ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×