Vishwak Sen New Movie update(Telugu cinema news): ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అదే ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మెకానిక్ రాకీ, లైలా వంటి సినిమాలు చేస్తున్నాడు. ఈ మూవీస్ సెట్స్ పై ఉండగానే మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు విశ్వక్. తన కెరీర్‌లో 13వ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొత్త దర్శకుడు శ్రీధర్ గంటా డైరెక్షన్‌లో ‘VS13’ మూవీ చేస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై చేస్తున్నాడు.
ఎస్‌ఎల్‌వి బ్యానర్‌లో 8వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో విశ్వక్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో విశ్వక్ ఫేస్ కనిపించలేదు. కానీ పోస్టర్‌లో అతడి బాడీ లుక్ చూస్తే మాత్రం ఇది ఫుల్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఖాకి డ్రెస్ వేసుకుని గన్ చూపిస్తూ వెనక నుంచి ఉన్న విశ్వక్ లుక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. దీని బట్టి ఈ మూవీ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read: విశ్వక్ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..
ఇదిలా ఉంటే విశ్వక్ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి మెకానిక్ రాకీ. ఈ మూవీ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. అందులో విశ్వక్ మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటు విశ్వక్ లైనప్‌లో మరో సినిమా ఉంది. అదే ‘లైలా’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
In a bent system, he refused to break, MASS KA DAS @VishwakSenActor marches to straighten the path 🔥🔥@SLVCinemasOffl Production No.8 is #VS13 – a High Voltage Action Drama 💥
Written and directed by #SreedharGanta@sudhakarcheruk5 @innamuri8888 @AJANEESHB @kishorkumardop… pic.twitter.com/iIXjVRMgjr
— SLV Cinemas (@SLVCinemasOffl) August 6, 2024