Mechanic Rocky First Single Promo: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ దుమ్ము దులిపేస్తున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చి అదరగొట్టేశాడు. ప్రారంభంలో ‘గామి’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతో విశ్వక్ తన లైనప్‌లో ఉన్న మరో సినిమాతో వచ్చాడు. తన నెక్స్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు.
ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకుంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇలా డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న విశ్వక్ ఇప్పుడు మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఒక కొత్త సినిమా చేస్తున్నాడు. అదే ‘మెకానిక్ రాకీ’. ప్రముఖ దర్శకుడు రవితేజ ముల్లుపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Also Read: మాస్ కా దాస్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ రిలీజ్.. కార్ ఛేజింగ్ హైలైట్..!
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఇందులో విశ్వక్ సేన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే ఇటీవల మేకర్స్ మరో అప్డేట్‌తో ఫుల్ హైప్ పెంచేశారు. ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. ఆ గ్లింప్స్ టీజర్ బట్టి సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అర్థం అయింది.
ఈ గ్లింప్స్‌లో విశ్వక్ ఫుల్ మాస్ అండ్ క్లాస్‌గా కనిపించాడు. ఇందులో అతడు మెకానిక్ రాకీగా కనిపించనున్నాడు. అలాగే మీనాక్షి, శ్రద్ధా శ్రీనాథ్‌లు కూడా తమ అందంతో ఆకట్టుకున్నారు. ఇలా ఈ టీజర్ అప్డేట్‌తో సరికొత్త ట్రీట్ అందించిన మేకర్స్ ఇప్పుడు మరో సర్‌ప్రైజ్ అందించారు. తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో విశ్వక్, మీనాక్షి జోడీ చాలా క్యూట్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ రేపు సాయంత్రం 4.04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
A vibrant folk song to vibe to 💃
Here's the Promo of #GulleduGulledu from #MechanicRocky 💥
Full lyrical out TOMORROW at 4:04PM 🤩
🎵 @JxBe
🎤 @iamMangli
✍️ #SuddalaAshokTeja#MechanicRockyOnOCT31 🛠️'Mass ka Das' @VishwakSenActor @itsRamTalluri @RaviTejaDirects… pic.twitter.com/9Zh3FfeI2g
— BA Raju's Team (@baraju_SuperHit) August 6, 2024