E-Paper
Advertisement

Gangs of Godavari Trailer: మాస్ కా దాస్ మరో అరాచకం.. అదిరిపోయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్

Gangs of Godavari Trailer: మాస్ కా దాస్ మరో అరాచకం.. అదిరిపోయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్
Advertisement

Gangs of Godavari Trailer: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా మే 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తాన్ని బూతులతో పాటు యాక్షన్ సీన్స్ తో నింపేశారు. పొలిటికల్ టచ్ తో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. విశ్వక్.. లంకల రత్న అనే పాత్రలో కనిపించాడు. ” మనుషులు మూడు రకాలు.. నాసి రకం, బోసి రకం, నాణ్యమైన రకం.. నువ్వు ఏ రకం” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. లంకల రత్న ఊరిలో రాజకీయ నాయకుడుగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

Advertisement

ఇక అతని అడ్డుకోవడానికి ప్రత్యర్థులు ఎన్నో సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. కానీ, రత్న మాత్రం ఏదో విధంగా రాజకీయ నాయకుడిగా మారతాడు. ఆ తరువాత అతనికి వచ్చిన అడ్డంకులు ఏంటి.. ? సొంత ఊరి వారే రత్నను ఎందుకు చంపాలనుకున్నారు.. ? అసలు రత్నమాల ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. లంకల రత్న పాత్రలో విశ్వక్ ప్రాణం పెట్టేశాడు. ఫలక్ నామా దాస్ తరువాత ఈ సినిమాలోనే విశ్వక్ అగ్రెసివ్ గా కనిపించాడు.

ఇక ట్రైలర్ లో బూతులు మాత్రం అడ్డుఅదుపు లేకుండా ఉన్నాయని చెప్పొచ్చు. ట్రైలర్ గురించి ఒక్కక్క మాటలో చెప్పాలంటే మాస్ కా దాస్ వన్ మ్యాన్ షో.. అరాచకం అంతే. ఇక చివర్లో విశ్వక్ .. మనుషులు మూడు రకాలు.. ఆడ, మగా, రాజకీయ నాయకులు అనే డైలాగ్ చెప్తాడు. అది కొంచెం వివాదాస్పదం అయ్యేలా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో మాస్ కా దాస్ మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×