E-Paper
Advertisement

Vishwambhara: విశ్వంభర సినిమా విడుదల అయ్యేది అప్పుడే, మెగాస్టార్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాతో కనెక్షన్

Vishwambhara: విశ్వంభర సినిమా విడుదల అయ్యేది అప్పుడే, మెగాస్టార్ ఆ బ్లాక్ బస్టర్ సినిమాతో కనెక్షన్
Advertisement

Vishwambhara: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్నటువంటి భారీ బడ్జెట్ సినిమాలలో విశ్వంభర కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఎప్పటినుంచో కలలు కంటున్నారు. పెద్దపెద్ద దర్శకులు కూడా ఆ అవకాశం దక్కలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,పూరి జగన్నాద్ వంటి హీరోలతో కొన్ని సందర్భాలలో సినిమాలు ఓకే అయి కూడా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఒకసారి పూజ వరకు వెళ్లి కూడా సినిమా క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడు అని దాదాపు ఖరారు అయిపోయింది. కానీ అది చివరి నిమిషంలో ఆగిపోయింది.

కొన్నిసార్లు అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని నమ్మకాలు కూడా ఉండవు. కొన్నిసార్లు ఊహించన కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశం ఉంటుంది. అలాంటిదే వశిష్ఠతో చిరంజీవి సినిమా చేయటం. వాస్తవానికి వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తాడు అని దాదాపు వార్తలు కూడా వచ్చాయి కానీ అది వర్కౌట్ కాలేదు. అలానే ఎవరు ఊహించని విధంగా మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయటం. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఉండటం ఇవన్నీ హఠాత్పరిణామాలు అని చెప్పాలి. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. వి ఎఫ్ ఎక్స్ అద్భుతంగా రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

రీసెంట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కొంతమేరకు ఆకట్టుకుందని చెప్పాలి. కానీ ఎక్కువ శాతం మంది ఈ టీజర్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని షాట్స్ ను హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు అంటూ, విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉందంటూ, బింబిసారా తీసినోడు బాహుబలి తీస్తాడా ఏంటి అని కొంతమంది పర్సనల్ ఎటాకింగ్ కూడా చేశారు. నిజమైన మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఒక విజువల్ ట్రీట్ల అనిపించింది అని చెప్పాలి. వాస్తవానికి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు. అనౌన్స్ కూడా చేశారు కానీ కొన్ని పరిణామాల వలన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఈ సినిమా డేట్ కి గేమ్ చేంజర్ సినిమా విడుదలవుతుంది.

ఇక విశ్వంభర సినిమాను మే తొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ డేట్ అనేది మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రత్యేకమైన చెప్పాలి. ఆయన కెరీర్ లో వచ్చిన సోసియో ఫాంటసీ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయింది. అలానే ఈ సినిమాకి జగదేకవీరుడు సినిమాకి కొద్దిపాటి కనెక్షన్ కూడా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా అదే ప్లాన్ చేసి జరిగినట్లయితే మెగా అభిమానులకి ఇంతకు మించిన శుభవార్త ఇంకొకటి ఉండదని చెప్పాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×