BigTV English

Ind VS Nz: నేటి నుంచే న్యూజిలాండ్‌, టీమిండియా తొలి టెస్ట్‌..పొంచి ఉన్న వర్షం !

Ind VS Nz: నేటి నుంచే న్యూజిలాండ్‌, టీమిండియా తొలి టెస్ట్‌..పొంచి ఉన్న వర్షం !

Ind VS Nz: టీమిండియా (India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మధ్య ఇవాల్టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. మూడు టెస్టులలో భాగంగా.. ఇవాళ బెంగళూరు వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ముందు ఈ టోర్నమెంట్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా అలాగే న్యూజిలాండ్ జట్లు రెడీ అయ్యాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ( M.Chinnaswamy Stadium ) వేదికగా ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది.


 

9 గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ మ్యాచ్ కు ముందు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. గత మంగళవారం నుంచి… బెంగళూరు ( Bengaluru ) వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అసలు కాలు బయట పెట్టకుండా వర్షాలు పడుతున్న విజువల్స్… సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.


Also Read: IND vs NZ 2024 Test Series: రేపటి నుంచే టెస్టు సిరీస్… హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

అయితే… ఈ నేపథ్యంలోనే ఇవాళ మ్యాచ్ కు కూడా వర్షం ( Rain ) అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడితే.. మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం అయ్యే ఛాన్స్ లు ఉంటాయి.లేకపోతే వర్షం… విపరీతంగా పడితే… మొన్నటి టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ తరహాలో జరుగుతుంది. ఫ్యాన్స్ మాత్రం మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.

Also Read: Ind vs NZ Test Series: టీమిండియాకు తిరుగులేని రికార్డు… 24 ఏళ్లలో న్యూజిలాండ్‌ ఒక్కసారి గెలవలేదు !

ఇక టీమిండియా (India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మధ్య.. రికార్డులను ఒకసారి పరిశీలిస్తే… గత 24 సంవత్సరాలుగా భారత గడ్డపైన న్యూజిలాండ్ ( New Zealand ) ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. 1988 సంవత్సరంలో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత… అసలు.. ఆ జట్టుకు చాన్సే రాలేదు. అన్ని సిరీస్ లు టీమిండియా గెలుచుకుంది. అయితే.. ప్రస్తుత లెక్కల ప్రకారం మళ్లీ టీమిండియా గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక టీమిండియా (India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) మధ్య మ్యాచ్ లను స్పోర్ట్స్ 18 ఛానెల్, లేదా జియో సినిమా యాప్ లో చూడొచ్చు.

జట్ల అంచనా

భారత్ (అవకాశం): 1 రోహిత్ శర్మ (కెప్టెన్), 2 యశస్వి జైస్వాల్, 3 శుభ్‌మన్ గిల్/సర్ఫరాజ్ ఖాన్, 4 విరాట్ కోహ్లీ, 5 రిషబ్ పంత్ (వికెట్), 6 KL రాహుల్, 7 రవీంద్ర జడేజా, 8 R అశ్విన్, 9 ఆకాశ్ దీప్/ కుల్దీప్ యాదవ్, 10 జస్ప్రీత్ బుమ్రా, 11 మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ : 1 డెవాన్ కాన్వే, 2 టామ్ లాథమ్ (కెప్టెన్), 3 విల్ యంగ్, 4 రచిన్ రవీంద్ర, 5 డారిల్ మిచెల్, 6 టామ్ బ్లండెల్ (వారం), 7 గ్లెన్ ఫిలిప్స్, 8 మిచెల్ సాంట్నర్/మైకేల్ బ్రేస్‌వెల్, 9 టిమ్ సౌతీ , 10 అజాజ్ పటేల్, 11 విల్ ఓ రూర్కే

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×