Big Stories

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’గా మెగాస్టార్ మరో రికార్డ్.. యంగ్ హీరోస్‌కి చిరు చాలెంజ్‌

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను ఏ మూహూర్తంలో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో కానీ.. సినిమా మాత్రం చాన్నాళ్ల తర్వాత ఆయ‌న‌కు మంచి కిక్ ఇచ్చే మూవీగా నిలిచిపోయింది. ఆయ‌న‌తో పాటు ర‌వితేజ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డం కూడా క‌లిసొచ్చిన అంశ‌మే.బాబీ దర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌లైంది. తొలి రోజు నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌టంతో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇక క‌లెక్ష‌న్స్ ప‌రంగా అయితే సినిమా దూసుకెళ్తోంది. తొలి రోజున రూ.50 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ‘వాల్తేరు వీరయ్య’.. 8 రోజుల‌కు రూ.175 కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. ఇక షేర్ క‌లెక్ష‌న్స్ ప్రకారం చూస్తే.. అది దాదాపు రూ.102 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

సినిమా వ‌సూళ్ల ప్ర‌కారం చూస్తే ‘వాల్తేరు వీరయ్య’ థియేట్రిక‌ల్ బిజినెస్ రూ.83 కోట్ల‌కు జ‌రిగింది. ఇప్పుడు షేర్ రూ.102 కోట్లు వ‌చ్చింది. అంటే దాదాపు రూ.20 కోట్లు లాభం వ‌చ్చింది. ఇక ఇవి కాకుండా శాటిలైట్‌, డిజిట‌ల్, యూ ట్యూబ్‌, హిందీ హ‌క్కులు అంటూ ఉంటాయి. ఇవ‌న్నీ నిర్మాత‌ల‌కు క‌లిసొచ్చే అంశాల‌నే చెప్పొచ్చు. ఇక్క‌డ ట్రేడ్ వ‌ర్గాలు ‘వాల్తేరు వీరయ్య’ వ‌సూళ్ల విష‌యంలో మ‌రో విష‌యాన్ని కూడా చెబుతున్నారు. రూ.100 కోట్ల‌కు పైగా షేర్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన సినిమాల్లో చిరంజీవివి మూడు సినిమాలున్నాయట‌. మ‌హేష్ సినిమాలు నాలుగున్నాయి. అంటే చిరంజీవి స్పీడు చూస్తుంటే టాలీవుడ్ కుర్ర హీరోల‌కు సైతం ఆయ‌న ఇప్పుడు స‌వాలు విసురుత‌న్నట్లేగా.

- Advertisement -

Follow this link for more updates : Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News