Big Stories

Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్యై ఫస్ట్ సింగిల్.. కంట్రోల్ చేసుకోలేకపోయానన్న దేవిశ్రీ

Waltair Veerayya : ఏమీ అనుకోకండి కంట్రోల్ చేసుకోలేక‌పోయానండి అని అంటున్నారు దేవిశ్రీ ప్ర‌సాద్‌.. మీరేదో ఊహించుకోవద్దు. అస‌లు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ దేన్నీ కంట్రోల్ చేసుకోలేక‌పోయారు. ఏమైంద‌నే వివ‌రాల్లోకి వెళితే.. ‘ఇప్పుడే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ చూశాను. మెగాస్టార్ చిరంజీవి ఎనర్జిటిక్ డాన్స్ మైండ్ బ్లోయింగ్. కాబట్టి కంట్రోల్ చేసుకోలేక న్యూస్ చెప్పేస్తున్నాను. ఈ వారం వాల్తేరు వీరయ్య నుంచి తొలి పాట రానుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుంటే అది బాస్ పార్టీ’ అని అంటున్నారు దేవిశ్రీ ప్రసాద్.

- Advertisement -

అంటే త్వరలోనే ‘వాల్తేరు వీరయ్య’ నుంచి పక్కా మాస్ నెంబర్ ఫ్యాన్స్, ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో భారీ సెట్ వేసి చిత్రీక‌రించిన సాంగ్‌నే తొలి సాంగ్‌గా రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా న‌టించిన సంగ‌తి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ర‌వితేజ కూడా న‌టిస్తున్నారు. చిరంజీవి హీరోగా అన్న‌య్య మూవీలో ర‌వితేజ త‌మ్ముడి పాత్ర‌లో క‌నిపించారు. త‌ర్వాత శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రంలో త‌ళుక్కున మెరిశారు. అయితే ఇప్పుడు మ‌రోసారి వాల్తేరు వీర‌య్య చిత్రంలో మాస్ మ‌హారాజా చిరంజీవి సోద‌రుడిగా మ‌ళ్లీ క‌నిపించ‌బోతున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమా రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. శ్రుతీ హాస‌న్ ఇందులో హీరోయిన్‌.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News