Big Stories

Twitter: ఉద్యోగులను వేటాడుతున్న మస్క్.. మరో 5500 మందికి లేఆఫ్!

Twitter: ట్విట్టర్ ను కొన్నప్పటి నుంచీ ఒకటే పని. ఉద్యోగులను వేటాడటమే మస్క్ టార్గెట్. వందా, రెండు వందలు కాదు.. వెయ్యి, రెండు వేలు కూడా కాదు.. అంతకుమించే ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించేశారు ట్విట్టర్ కొత్త బాస్. కంపెనీ లాభాల్లోకి రావాలంటే.. ఖర్చులు తగ్గించుకోవడమే ముఖ్యం అనుకుంటున్నట్టు ఉన్నారు. ట్విట్టర్ తన చేతికి రాకముందే.. ఎవరెవరిని తీసేయాలో ఓ లిస్ట్ రెడీ చేసుకొని ఉంటారు. అఫిషియల్ గా ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి రాగానే.. ఆయన చేసిన పని ఎంప్లాయిస్ ను వెళ్లగొట్టడమే.

- Advertisement -

మొదటి వారంలోనే దాదాపు సగం మంది ఉద్యోగులకు ముందస్తు శాలరీలు ఇచ్చిమరీ ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత వెంటనే నాలుకు కరుచుకుని.. అందులో కొందరిని వెనక్కి రావాల్సిందిగా కోరారు. పొరబాటు జరిగింది.. మీ సేవలు సంస్థకు చాలా అవసరమంటూ వారిలో కొందరిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఇదంతా వారం క్రితం విషయం. లేటెస్ట్ గా మళ్లీ ఉద్యోగులపై వేటు వేశారు ఎలాన్ మస్క్. ఈసారి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ బలి అయ్యారు.

- Advertisement -

4400 నుంచి 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ట్విట్టర్‌ నుంచి తొలగించారు. కాంట్రాక్టు ఎంప్లాయిస్ కావడంతో.. వారికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేసినట్టు తెలుస్తోంది. ఆ ఉద్యోగులను తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చిందట ట్విట్టర్. కంపెనీ ఈ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కట్ అయ్యాక కానీ వారికి తెలీలేదు తమ ఉద్యోగాలు పోయాయని. వరల్డ్ వైడ్ గా ఉన్న ట్విట్టర్ ఆఫీసుల్లో ఈ లేఆఫ్ కొనసాగుతోంది. తాజా కోతలపై ట్విట్టర్‌ నుంచి గానీ, ఎలాన్ మస్క్‌ నుంచి గానీ అధికారికంగా ప్రకటన ఏదీ రాలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News