E-Paper
Advertisement

Tamil superstars : తమిళ సూపర్ స్టార్లపై ఈ రూమర్స్ ఏంటి? కోటి ఇస్తేనే కథ వింటారట

Tamil superstars : తమిళ సూపర్ స్టార్లపై ఈ రూమర్స్ ఏంటి? కోటి ఇస్తేనే కథ వింటారట
Advertisement

Tamil superstars : సినిమాలు చేద్దామనుకునే ప్రొడ్యూసర్లు చాలా మందే ఉన్నారు. కాని వారికి హీరోలే దొరకడం లేదు. ముఖ్యంగా తెలుగు హీరోలెవరూ ఖాళీగా లేరు. మీరు ఏ స్టార్ హీరో పేరైనా తీసుకోండి. వచ్చే రెండు మూడేళ్ల వరకు ఖాళీగా ఉన్న స్టార్ హీరోనే లేడు. మరి ప్రొడ్యూసర్లంతా ఏమైపోవాలి. సినిమా తీసి నష్టపోవడం ఒకటైతే.. సినిమాలు తీయకపోయినా నష్టపోవడం మరొకటి. అందుకే, ఈమధ్య పక్క ఇండస్ట్రీలో వేలుపెడుతున్నారు మన తెలుగు నిర్మాతలు.

Advertisement

విజయ్‌తో వారసుడు సినిమా తీసింది దిల్ రాజు. ధనుష్‌తో సార్ సినిమా తీసింది కూడా మనవాళ్లే. సో, తెలుగు నిర్మాతలు తమిళ హీరోల డేట్స్ కోసం చూస్తున్నారు. కాకపోతే, ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. తమిళ హీరోలకు సినిమా కథ చెప్పాలంటే… ముందు కోటి లేదా రెండు కోట్లు ఇచ్చుకోవాలట. సూపర్ స్టార్ అనుకున్న హీరోలే ఇలా అడ్వాన్స్‌గా డబ్బులు అడుగుతున్నారు. మొన్నామధ్య మన తెలుగు నిర్మాత ఒకాయన.. తమిళంలో మంచి స్టార్ డమ్ ఉన్న హీరోను కలిసే ప్రయత్నం చేశాడు. ఆయనతో సినిమా చేస్తే.. ఫుల్ మార్కెట్, ఫుల్ వసూల్, ఫుల్ ప్రాఫిట్ అనుకున్నారు. అలా అనుకుని ఇలా సంప్రదించారో లేదో.. వెంటనే ఆ హీరో భార్య, కూతురు దిగిపోయారట. మీ కథ వినాలంటే.. ముందుగా మాకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారట. అసలు కథేంటి, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్, నిర్మాత వంటి వివరాలేం తేలకపోయినా.. కథ వినాలంటేనే కోటి తీసుకుంటామని చెబుతున్నారట. ఒక విధంగా ఇదీ కరెక్టేనేమోలే. లేకపోతే, ఎవరికి వారు వెళ్లి కథ చెబుతాం వింటారా అంటే హీరోలు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి. అందులోనూ టాప్ హీరోలు. అందులోనూ, తెలుగు నుంచి వచ్చే ఎవరో నిర్మాతల కోసం ఎందుకు వినాలి.

ఇక మరో తమిళ హీరో ఉన్నాడు. అతను కూడా భారీ మార్కెట్ ఉన్న హీరోనే. తెలుగులోనూ క్రేజ్ ఉన్న నటుడు. ఆ నటుడిని కలిసి కథ చెప్పేందుకు ప్రయత్నిస్తే.. నెల రోజుల పాటు తిప్పించుకుంటాడు. పెద్దగ కథ మీద చర్చలు జరగకుండానే.. ముందు కోటి అడ్వాన్స్ కొట్టు అన్నాడట. తీరా డబ్బులు పంపించిన తరువాత నెల రోజుల వరకు నో రెస్పాన్స్. నెల తర్వాత దయతలచి కథేంటి అని అడిగాడట. అంటే.. అప్పటి వరకు టెన్షన్ పడాల్సిందే కదా. సో, తెలుగు నిర్మాతలు తమిళ హీరోల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నిజానికి ఇలాంటి ట్రెండే తెలుగులోనూ ఉంది. ఓ నిర్మాత ఫలానా టాప్ హీరోతో సినిమా తీసేందుకు బుక్ చేసుకుంటాడు. నీ తరువాత సినిమా నా ప్రొడక్షన్లోనే చేయాలని రాయించుకుంటాడు. ఇందుకోసం కోటి ఏంటి కోట్లు సమర్పించుకుంటాడు. కథ, డైరెక్టర్, మిగతా వివరాలేం లేకుండానే.. ఒక హీరో మరో నిర్మాతకు కమిట్‌మెంట్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు.. కథ వినడం కోసం కోటి తీసుకోవడంలో తప్పేం లేదు. లేదంటే… ప్రతి ఒక్కరు బయల్దేరుతారు పేపర్లు పట్టుకుని. Tamil superstars : తమిళ సూపర్ స్టార్లపై ఈ రూమర్స్ ఏంటి? కోటి ఇస్తేనే కథ వింటారట

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×