Big Stories

Ipl : పవర్ ప్లేలోనే టపటపా వికెట్లు.. ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు

- Advertisement -

ipl : ఐపీఎల్ అంటే ధనాధన్ షాట్స్ మాత్రమే కాదు.. ఫటాఫట్ వికెట్లు పడడం కూడా. పవర్ ప్లేలో ఎవరు ఎంత బాదుతారు అనేది ఓ లెక్క. దానికి తగ్గట్టే రూల్స్ కూడా ఉంటాయి. టీ20లో మజా రావడానికి ఇలా చేశారు. ఓపెనర్లు ఫోర్లు, సిక్సర్లు బాదుతుంటే… స్టేడియంలో ఉన్న అభిమానులు, టీవీల ముందు కూర్చున్న ఫ్యాన్స్ కేరింతలు కొట్టాలి. అదీ కాన్సెప్ట్. క్రికెట్‌ను మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చిన ఐపీఎల్‌లో ఇలాంటి ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఈ పొట్టి ఫార్మాట్లో పవర్ ప్లే ఉద్దేశమే బ్యాటర్లు బాల్‌ను ఉతకడం. కాని, దానికి కంప్లీట్ అపోజిట్‌గా వికెట్లు తీస్తున్నారు. బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును పవర్ ప్లేలోనే కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. వాటిలో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన మూడు మ్యాచ్‌లు.

- Advertisement -

1. పుణె వారియర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ –
2011 సీజన్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. జస్ట్ 5.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయింది. స్కోర్ జస్ట్ 36 పరుగులు మాత్రమే. పైగా ఔటైన టాప్-4 వికెట్లు వరల్డ్ క్లాస్ ప్లేయర్సే. గిల్‌క్రిస్ట్, షాన్ మార్ష్, పాల్ వాల్తాటి, దినేశ్ కార్తీక్.. ఈ నలుగురు కేవలం 9 పరుగులకే ఔట్ అయి పెవిలియన్ చేరారు.

2. సన్ రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్
2013 సీజన్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. కేవలం 4.4 ఓవర్లలోనే 5 వికెట్లు పోగొట్టుకుంది. అప్పటికి 19 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షత్ రెడ్డి, శిఖర్ ధావన్, కుమార సంగక్కర, కరణ్ శర్మ, తిసారా పెరెరా ఔట్ అయ్యారు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ బౌలర్ జేమ్స్ ఫాల్కనర్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అజిత్ చండీలా 2 వికెట్లు తీశాడు.

3. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్తాన్ రాయల్స్
2014 సీజన్‌లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో… పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయింది బెంగళూరు. 5.2 ఓవర్లకు బెంగళూరు స్కోరు 17/5. విరాట్ కొహ్లీ, యువరాజ్ సింగ్, డివిలియర్స్, మార్కెల్‌ను పవర్ ప్లేలోనే ఔట్ చేసి గట్టి షాక్ ఇచ్చింది రాజస్తాన్. ఆ మ్యాచ్‌లో ప్రవీణ్ తంబే 4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News