BigTV English

Pawan Kalyan: హరిహర వీరమల్లు సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు..?

Pawan Kalyan: హరిహర వీరమల్లు సెట్స్‌పైకి వెళ్ళేదెప్పుడు..?

When Will Pawan Movie Harihara Veeramallu Go On The Sets: టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ ఇటు మూవీస్‌లోనూ, అటు పాలిటిక్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటీటీని సంపాదించుకున్నాడు. జనసేన పార్టీని స్థాపించి పాలిటిక్స్‌లో తన మార్క్‌ని చూపించాడు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. గతంలొ తాను కమిట్మెంట్ ఇచ్చిన మూవీస్‌ అన్ని పెండింగ్‌లో ఉండటంతో వాటిని ఎప్పుడు పూర్తి చేస్తాడా అంటూ పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా పవన్‌ని పొలీటిషియన్ కంటే హీరోగా ఇష్టపడే వాళ్లే ఎక్కువగా ఉంటారు తెలుగురాష్ట్రాల ప్రజలు. అంతేకాకుండా వీరందరిని కూల్ చేయడానికి తన మూవీస్‌ని దారిలో పెట్టి కంప్లీట్ చేస్తాడా లేక పొలిటీషియన్‌గానే ఉండిపోతాడా అనేది అందరి ప్రశ్నగా మారింది.


ఎన్డీఏ కూటమితో ఏపీలో పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టాడు పవన్. ఎందుకంటే ముందునుంచే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న పవన్. తన మార్క్‌ని అలాగే కొనసాగిస్తున్నాడు. అంతేకాదు ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు సాల్వ్‌ చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు. ఇక ఇంతవరకు బాగానే ఉంది. కానీ పవన్ మూవీ ప్రాజెక్ట్‌ల పరిస్థితి ఏంటనేది అసలు ప్రశ్న. తాను చేయాల్సిన మూవీస్ అలానే పెండింగ్‌లో ఉన్నాయి. అవేంటంటే ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, ఓజీ, హరిహర వీరమల్లు. ఇవి సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతాయంటూ అటు డైరెక్టర్స్, ఇటు ప్రొడ్యూసర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు పవన్ మూవీస్ చేస్తాడా లేదా అనేది ప్రశ్నగా మారింది. మూడు నెలలు పవన్ డేట్స్ ఇస్తే హరిహర వీరమల్లు మూవీ ఆల్మోస్ట్‌ కంప్లీట్ అవడానికి రెడీగా ఉండనుందని డైరెక్టర్ అభిప్రాయం. ఇంకో 25 రోజులు టైమ్ ఇస్తే ఓజీ కూడా పూర్తిస్థాయిలో కంప్లీట్ అవుతుందని వారి అభిప్రాయం. అయితే ఇవి పక్కన పెడితే ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ మాత్రం 25 శాతమే పూర్తి చేసుకుంది.

Also Read: లిప్‌లాక్ సీన్లపై స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ


అయితే వీటికి తోడు మరో మూవీ కూడా సురేందర్ రెడ్డితో చేయనున్నాడంటూ నిర్మాత రామ్‌ తల్లూరి అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. సరే ఈ మూవీ విషయాన్ని పక్కన పెడితే..హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ ఏ మూవీ చేయకుండా పవన్‌ మూవీకోసం మూడేళ్లు వెయిట్ చేస్తున్నాడు. అదే వరుసలో ఉస్తాద్‌ భగత్‌సింగ్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్ సైతం మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ఇంతకాలం వెయిట్ చేయని క్రిష్ హరిహర వీరమల్లు సైడ్ తప్పుకోవడంతో ఏఎం రత్నం మనువడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీని. ఇక క్రిష్ సైడ్ అయి అందాల భామ అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ మూవీని తీస్తు్న్నాడు. అయితే దర్శకుడు హరీశ్‌ శంకర్‌కి సైతం తెలుసు. పవన్‌తో మూవీ అంటే మరెన్నీ రోజులు వెయిట్ చేయాలో. అందుకే దాని కోసం వెయిట్ చేయకుండా తన నెక్స్ట్‌ మూవీని రామ్‌తో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అంతేకాదు మాస్ మహరాజ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీని 6 నెలల్లో కంప్లీట్ చేశాక రామ్‌ మూవీని సెట్స్‌ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×