BigTV English

Bollywood News: లిప్‌లాక్ సీన్లపై స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ

Bollywood News: లిప్‌లాక్ సీన్లపై స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ

Bollywood Actress Aishwarya Rai Reacted To The Lip lock Scenes: 1980sలో టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాకా సినిమాల్లో నటించే హీరోయిన్లు అనగానే మంచి కట్టు, బొట్టుతో సాంప్రదాయ పద్దతిలో ఆడియెన్స్‌ని అలరిస్తూ అందరి మన్ననలను పొందేవారు. అందులో రొమాన్స్ సీన్స్ అస్సలు ఉండేవి కావు. కానీ రాను రాను ఆ తరువాత సినిమాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా హీరోహీరోయిన్ల రొమాన్స్‌కే చాలామంది మొగ్గుచూపుతున్నారు. అందుకనుగుణంగానే డైరెక్టర్లు వారి చేతికి వాటం కల్పిస్తున్నారు. తాము రాసే స్క్రిఫ్ట్‌లలో రొమాన్స్ సీన్స్ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. దీనికి ఒక కారణం ఉంది లేండి, ఎందుకంటే.. తాము తీయబోయే మూవీలో రొమాన్స్ లేకపోతే ఆడియెన్స్ అస్సలు ఇంట్రెస్ట్ పెట్టడం లేదు. అందుకే ఇలాంటి సీన్ల కోసం ముందుగానే హీరోయిన్‌తో మాట్లాడి మరి అలాంటి సీన్లకు ఎస్ అంటేనే ఓకే చేస్తున్నారు. హీరోయిన్లకి కూడా వేరే గత్యంతరం లేక అన్నింటికి ఓకే చెప్పేస్తున్నారు.


ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. మత్తెక్కించే తన అందమైన కళ్లతో, చెక్కిన శిల్పం లాంటి శరీరాకృతితో కొన్ని దశాభ్థాల పాటు కుర్రకారు మనసుల్ని దోచేసుకుంది ఈ భామ. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.. ఆవిడే మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వరరాయ్‌. బాలీవుడ్ హీరోలు కండలవీరుడు సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ ఖాన్‌ల నుంచి మొదలుకొని హృతిక్‌రోషన్, రణబీర్‌కపూర్ వరకూ అందరితో రొమాన్స్ సీన్స్ చేసింది ఈ భామ. తన మూవీ కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని షరతులతో నటించిన ఆ తరువాత క్యారెక్టర్లు డిమాండ్ చేయడంతో లిప్‌ సీన్లకు ఓకే చెప్పక తప్పలేదు. అయితే ఆమె ఇలా యాక్ట్ చేయడానికి కూడా ఓ పెద్ద రీజన్ ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్ని విషయాలను వ్యక్తం చేసింది.

Also Read: డబుల్ డోస్‌ పెంచిన డబుల్ ఇస్మార్ట్


గత 8 ఏళ్ల కిందట రణబీర్‌ కపూర్‌తో కలిసి యే దిల్ హై ముష్కిల్ మూవీలో రొమాంటిక్ సీన్లలో కనిపించింది ఐశ్వర్య. ఈ మూవీకి సంబంధించి ఫిల్మ్‌పేర్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ మూవీలో తన యాక్టింగ్ గురించి మాట్లాడింది. తనను తాను తెలివైన నటిగా చెప్పుకుంటూ, ఆమె ఎప్పుడు ఆడియెన్స్ అంచనాలకు అందని ప్రదర్శన మాత్రమే చేస్తూ ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక నటిగా బట్టల గురించి పట్టించుకుంటామా అంటూ.. కండీషన్లు పెట్టుకుంటూ ఉండలేము కదా.. అయినా ఇవన్నీ పట్టించుకుంటూ నేను ఉండలేను కదా అంటూ తన మనసులోని మాటలను తేటతెల్లం చేసింది. ఇక ధూమ్ 2 మూవీ గురించి చెప్పుకొచ్చి్ంది. అప్పటికే తన కెరీర్ స్టార్ట్ అయి పదేళ్లు అయిందని, కెరీర్ స్టార్టింగ్‌లో కిస్ సీన్లు లాంటివి ఇంటిమేట్ సీన్లు చేయడానికి ఇష్టపడే దానిని కాదన్నది. కానీ మారుతున్న కాలానుగుణంగా కొన్ని సీన్స్ డిమాండ్ చేసినప్పుడు చేయకతప్పదని, అంతేకాదు అలాంటి సీన్లకు తగ్గట్టుగా తనకు తాను ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నానని తెలిపింది. అంతేకాదు ధూమ్ 2 మూవీలో ముద్దు సీన్ జరిగినప్పుడు తన క్యారెక్టర్‌ మాత్రమే చూశానని, అంతేకాని కావాలని ఎవరు ముద్దు పెట్టుకోరని చెప్పింది. ఆ మూవీలో ముద్దు సీన్ షూట్ అయిపోగానే హృతిక్‌కి దూరంగా వెళ్లిపోయానని తెలిపింది. ఆన్ స్ర్కీన్‌ మీద కనిపించాలనే ఆశ ఉన్నప్పుడు అనుకున్నట్టుగానే పర్‌ఫెక్ట్‌గా ఉండాలని కోరుకుంటానే తప్పా, నేనెప్పుడు హద్దులు దాటి ప్రవర్తించలేదని అన్నది. అంతేకాకుండా నటిగా కెరీర్‌లో రాణించాలంటే కొన్ని సీన్లు చేయకతప్పదు మరియు నటనలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని అప్పుడే కెరీర్‌లో నటిగా ఎదగడం కష్టమన్నది ఐశ్వర్య.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×