BigTV English

Dhanush: ధనుష్- ఐశ్వర్య విడాకులు రద్దు.. ఆయన కోసమేనా.. ?

Dhanush: ధనుష్- ఐశ్వర్య విడాకులు రద్దు.. ఆయన కోసమేనా.. ?

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ పర్సనల్ లైఫ్ లో ఎన్నో వివాదాలు ఉన్న విషయం తెల్సిందే. అందులో తన భార్య ఐశ్వర్య  రజినీకాంత్ కు విడాకులు ఇవ్వడం కూడా ఒకటి.  సూపర్ స్టార్ రజినీకాంత్  పెద్ద కూతురు ఐశ్వర్యతో ధనుష్ వివాహం 2004 లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక దాదాపు 18 ఏళ్ల దాంపత్యం తరువాత  ఈ జంట 2022 లో విడాకులు ప్రకటించింది.


తాము ఎన్నో విధాలా ప్రయత్నించినా.. కలిసి ఉండడం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే వీరి విడాకులు అటు ధనుష్ ఫ్యామిలీ కానీ, ఇటు రజినీ ఫ్యామిలీ కానీ ఇష్టం లేదు. అప్పుడే వీరిద్దరిని కలపడానికి ఆ రెండు కుటుంబాలు చాలా ప్రయత్నాలు చేశాయి. ధనుష్ తండ్రి అయితే మీడియా ముందే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. విడాకులు మాత్రమే ప్రకటించారు.. ఇంకా కోర్టు లో ఈ కేసు నడుస్తోంది. ధనుష్- ఐశ్వర్యను కలపడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక ఈ కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించలేదు.

తమకు కచ్చితంగా విడాకులు కావాలని  ధనుష్- ఐశ్వర్య కోరడంతో చేసేది లేక వారు కూడా మౌనంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలోనే వీరి విడాకుల కేసు విచారణకు వచ్చింది. నేడు కోర్టులో విడాకుల విచారణకు ధనుష్ కానీ, ఐశ్వర్య కానీ హాజరు కాలేదు. దీంతో కోర్టు.. తదుపరి  విచారణను అక్టోబర్ 19 కి  వాయిదా వేసింది. ఈ జంట హాజరుకాకపోవడంతో కోలీవుడ్ లో అనేక అనుమానాలు మొదలయ్యాయి.  ధనుష్- ఐశ్వర్య విడాకులను రద్దు చేసుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. అందుకు కారణం .. రజినీకాంత్ అనారోగ్యం అని టాక్ నడుస్తోంది.


గత కొంతకాలంగా రజినీ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే అయన గుండెకు స్టెంట్ వేసిన విషయం కూడా విదితమే.  రజినీని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు తెలిపారట. ఇక ఇలాంటి సమయంలో విడాకులు.. కోర్టు, మీడియా.. ట్రోల్స్ ఇవన్నీ ఆయన ఆరోగ్యానికి  అంత  మంచిది కాదని భావించిన ఐశ్వర్య.. తమ విడాకుల విషయాన్నీ కొద్దిగా వెనక్కి నాట్టినట్లు తెలుస్తోంది. దానికి ధనుష్ సైతం ఓకే చెప్పినట్లు సమాచారం.

ధనుష్ కు రజినీ అంటే ఎంత ఇష్టమో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆరోగ్యం కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అక్టోబర్ 19 వరకు ఆగాలి. ఆరోజు కనుక ధనుష్ – ఐశ్వర్య విచారణకు హాజరయితే.. విడాకులు తీసుకున్నట్టే అని నెటిజన్స్ కామన్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×