E-Paper
Advertisement

HaromHara: హరోంహర ఓటీటీ రిలీజ్ వాయిదా.. ప్రణీత్ హన్మంతు వలనేనా..?

HaromHara: హరోంహర ఓటీటీ రిలీజ్ వాయిదా..  ప్రణీత్ హన్మంతు వలనేనా..?
Advertisement

HaromHara: యువ దళపతి సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరోంహర. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై జి. సుమంత్ నాయుడు ఈ సినిమాను నిర్మించాడు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. అయితే సుధీర్ బాబుకు మాత్రం అంత హిట్ ను అందివ్వలేకపోయింది.

చిత్తూరు జిల్లా యాసతో సుధీర్ నటనకు మాత్రం బాగానే మార్కులు పడ్డాయి. ఈ సినిమా చూసిన వారందరూ పుష్ప చూసినట్టే ఉందని చెప్పుకొచ్చారు. ఇక థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే హరోంహర డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ మరియు ఆహా సొంతం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రెండు ఓటీటీలలో కూడా జూలై 11 న హరోంహర సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.

Advertisement

ఇక దీంతో అభిమానులు ఈరోజు జూలై 11 కావడంతో హరోంహర చూద్దామని యాప్స్ ఓపెన్ చేయగా.. సినిమా కనిపించలేదు. దీంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ సినిమా స్ట్రీమింగ్ కాలేదు అని అంటే.. కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ పొరపాటు జరిగిందని సమాచారం. టెక్నీకల్ ఇష్యూస్ వలన ఈరోజు హరోంహర స్ట్రీమింగ్ అవ్వలేదని చెప్పుకొస్తున్నారు.

ఇంకోపక్క.. హరోంహర ఓటీటీ రిలీజ్ వాయిదాకు.. ప్రణీత్ హన్మంతు అరెస్ట్ కు ఏమైనా సంబంధం ఉందా అని కూడా ఆరాలు తీస్తున్నారు. హరోంహర సినిమాలో ప్రణీత్ ఒక కీలక పాత్రలో నటించాడు. అతను అరెస్ట్ అయిన సమయంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే.. సినిమాపై కూడా విమర్శలు వెల్లువెత్తుతాయని అలోచించి రిలీజ్ వాయిదా వేసారేమో అని కూడా అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×