E-Paper
Advertisement

Manchu Vishnu: పవన్ కు సపోర్ట్ సరే.. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు సంగతేంటీ.. ప్రెసిడెంట్ గారు ?

Manchu Vishnu: పవన్ కు సపోర్ట్ సరే.. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు సంగతేంటీ.. ప్రెసిడెంట్ గారు  ?
Advertisement

Manchu Vishnu: అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.. ? ప్రస్తుతం ఎవరికి అర్ధం కానీ మిస్టరీ ఇది. ఒకపక్క జానీ మాస్టర్ కేసు.. ఇంకోపక్క తిరుపతి కల్తీ లడ్డూ వివాదం. ఈ రెండు వివాదాల్లో మెయిన్ టార్గెట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక వివాదంలో ఆయనను ట్రోల్ చేస్తుంటే.. ఇంకో వివాదంలో ఆయనే వైసీపీని ట్రోల్ చేస్తున్నారు. ఇక  చాలామంది ప్రముఖులు కల్తీ లడ్డూ వివాదంలో పవన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.. ఇంకొంతమంది పవన్ ను విమర్శిస్తున్నారు.

నిన్నటికి నిన్న నటుడు ప్రకాష్ రాజ్.. పవన్ పై విరుచుకుపడిన విషయం తెల్సిందే. “డియర్ పవన్ కళ్యాణ్ …మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది .. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారు. ఈ సమస్యను జాతీయంగా ఎందుకు ఊదరగొడుతున్నారు… ఇప్పటికే దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు” అంటూ సైలెంట్ గా కౌంటర్ వేసాడు.

Advertisement

ఇక ప్రకాష్ రాజ్ పై పవన్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. నీ పని నువ్వు చేసుకో అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా లైట్ గా వార్నింగ్ ఇచ్చాడు. “ప్రకాష్ రాజ్.. మీరు మరి అంతలా నిరుత్సాహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అటువంటి పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు  సరిగ్గానే పిలుపునిచ్చారు. ఇక ఇలాంటి విషయాల్లో మీలాంటి వారు కలుగజేసుకుంటే.. మతం ఏ రంగు పులుముకుంటుందో.. మీ పరిధుల్లో మీరు ఉండండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక పోస్ట్ చూసిన కొంతమంది.. సరే ఈ విషయంలో పవన్ కు సపోర్ట్ చేసారు సరే.. మరి జానీ మాస్టర్ విషయంలో ఇప్పటివరకు మీరు నోరు ఎందుకు మెదపలేదు ప్రెసిడెంట్ గారు. పూనమ్ కౌర్ మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేసిన్నట్లు తెలిపింది. అది తీసుకున్నారా.. ? తీసుకోలేదా.. ? కనీసం ఆమె మీ వద్దకు వచ్చిందా.. ? లేదా..? అని ఒక్క ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. పూనమ్.. త్రివిక్రమ్ పేరు చెప్పినప్పుడు కనీస విచారణ అయినా  చేయాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement

జూనియర్ డ్యాన్సర్ ను లైంగికంగా వేధించిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. జానీ మాస్టర్ ను రిమాండ్ కు తరలించారు. ఇక తన నేరాన్ని జానీ మాస్టర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దురుద్దేశ్యంతోనే జానీ మాస్టర్ ఇదంతా చేశాడని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఇక ఇదంతా పక్కన పెడితే.. జానీ మాస్టర్ వివాదంలోకి నటి పూనమ్ కౌర్ వచ్చి.. త్రివిక్రమ్ ను, పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి లాగింది. త్రివిక్రమ్ కూడా తనను వేధించాడని,  మా అసోసియేషన్ కు తాను ఫిర్యాదు చేసినా ఎవరు తీసుకోలేదని తెలిపింది.

అంతేకాకుండా ఇప్పుడైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించమని కోరింది. ఈ ఒక్క ట్వీట్.. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ గుట్టు మొత్తం బయటపడేలా చేసింది. త్రివిక్రమ్ వేధించింది పవన్ కళ్యాణ్ కోసమే అని.. కొంతమంది ప్రముఖులు నిర్మొహమాటంగా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొస్తున్నారు. ఇంత జరిగినా మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ఎందుకు రెస్పాండ్ కావడం లేదని నెటిజన్స్ అంటున్నారు. మరి ముందు ముందు  విష్ణు ఏమైనా రెస్పాండ్ అవుతాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×