BigTV English

Samantha:- సిటాడెల్‌లో సమంత అంతకు మించి చూపించనుందా..!

Samantha:- సిటాడెల్‌లో సమంత అంతకు మించి చూపించనుందా..!

Samantha:- ఇంగ్లీష్ వర్షన్ సిటాడెల్‌కు రీమేక్ వర్షన్ తీయబోవడం లేదని క్లారిటీ ఇచ్చింది సమంత. ప్రియాంక చోప్రా ప్లేస్‌లో సమంతను తీసుకున్నారు డైరెక్టర్ రాజ్ అండ్ డీకే. సినిమా సిటాడెల్ ఒరిజినల్ వర్షన్‌లో చాలా హాట్ సీన్స్ ఉన్నాయి. కొన్ని సీన్లలో ప్రియాంక చోప్రానే ఇబ్బంది పడిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కేవలం ప్రైవేట్ పార్ట్స్ కనిపించనీయకుండా చాలా జాగ్రత్తగా షూట్ చేశామని చెప్పింది. ఇందుకోసం, యూనిట్ మొత్తం చాలా బాగా సహకరించారన్నది ప్రియాంక చోప్రా వర్షన్. ఇప్పుడు ఇదే సిటాడెల్‌ను ఇండియన్ వర్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. జనరల్‌గా ఇలాంటి వాటిని రీమేక్స్ అంటారు. అదే కథ.. పాత్రధారులు మాత్రం వేరు. కాని, ఇది రీమేక్ కానే కాదంటోంది సమంత. ఇది సిటాడెల్‌కు ఎడాప్షన్ సిరీస్ అంటూ కొత్త పదం వాడింది.


సరే, సిటాడెట్ రీమేకా, ఎడాప్షన్ సిరీసా అన్నది తరువాత సంగతి. ఇందులో హాట్ సీన్స్ ఉంటాయా అనేదే అందరి ప్రశ్న. గతంలో ఇలాంటి సీన్లలో నటించడం వల్లే పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్న వార్తలు వినిపించాయి. ఫ్యామిలీమెన్-2లో కొన్ని సీన్స్‌లో నటించింది. ఆ తరువాత పుష్పలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు సిటాడెల్‌లో అంతకు మించి రొమాన్స్, హాట్ సీన్స్ ఉంటాయంటున్నారు. పైగా సమంత ఇప్పుడు ఫ్రీ అయిపోయినట్టే. ఎలాంటి సెంటిమెంట్స్, ఫ్యామిలీ ప్రెషర్స్‌కు లొంగాల్సిన అవసరం లేదు. సో, ఈ సిరీస్‌‌లో సమంత అందాలను గట్టిగానే తెరపై చూపిస్తారన్న టాక్ అయితే వినిపిస్తోంది.

ఇప్పటికే, సమంత డౌన్ ఫాల్‌లో ఉంది. ఈ మధ్య సినిమాలేవీ హిట్ కాలేదు. శాకుంతలం సినిమా అయితే డిజాస్టర్. ఇక విజయ్ దేవరకొండతో తీస్తున్న ఖుషీ సినిమా ఎలా ఉంటుందో చెప్పలేం. తనకు వచ్చిన మయోసిటీస్ జబ్బు కారణంగా సరిగ్గా ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఇవ్వలేకపోయింది సమంత. మరి సిటాడెల్‌లో ఎలా నటిస్తుందో చూడాలి. పైగా సిటాడెల్ సిరీస్ కోసం దాదాపు ఆరు కోట్లు తీసుకుంటోంది సమంత. ఐదు కోట్లు రెమ్యునరేషన్, కోటి రూపాయలు ఇతరత్రా ఖర్చుల కోసం ఖర్చుపెడుతున్నారట. ఇండియన్ వర్షన్ సిటాడెల్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది సమంత.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×