BigTV English

Balagam: మ‌రో రెండు ఇంటర్నేష‌న‌ల్ అవార్డ్స్ గెలుచుకున్న ‘బలగం’…

Balagam: మ‌రో రెండు ఇంటర్నేష‌న‌ల్ అవార్డ్స్ గెలుచుకున్న ‘బలగం’…


Balagam:- తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్ర‌దాయ‌ల‌ను తెలియ‌జేస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. చిన్న చిత్రంగా వచ్చి బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది. ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకోవ‌ట‌మే కాదు. ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంటూ బ‌ల‌గం సినిమా ఇప్ప‌డు టార్చ్ బేర‌ర్‌గా మారింది. నిజాయ‌తీగా, జెన్యూన్‌గా రాసిన క‌థ‌, చక్కటి మూవీ మేకింగ్‌తో తెలంగాణ‌లోని సిరిసిల్ల అనే ప్రాంతంలో తెర‌కెక్కించిన బ‌ల‌గం చిత్రం ఇప్పుడు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అవార్డుల‌ను గెలుచుకుంటూ అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

నిర్మాత దిల్ రాజు వారసులు హ‌ర్షిత్‌, హ‌న్షిత‌లు దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బ‌ల‌గం సినిమాను నిర్మించారు. కాగా.. క‌మెడియ‌న్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హార్ట్ ట‌చింగ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. క‌లెక్ష‌న్స్‌తో పాటు ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకుందీ చిత్రం. వ‌ర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌తో బ‌ల‌గం సినిమా తిరుగులేని స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది.


క‌మ‌ర్షియ‌ల్‌గానే కాకుండా ఇప్పుడు అంత‌ర్జాతీయంగా అనేక అవార్డుల‌ను సొంతం చేసుకుంటోంది బ‌ల‌గం. బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ ఇలా ప‌లు విభాగాల్లో అవార్డుల‌ను అంత‌ర్జాతీయంగా ద‌క్కించుకుంటోంది బ‌లగం సినిమా. తాజాగా ఈ లిస్టులో మ‌రో రెండు అంత‌ర్జాతీయ అవార్డులు వ‌చ్చి చేరాయి. తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు అద్దం ప‌ట్టి ఎన్నో ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల‌ను ద‌క్కించుంటోన్న బ‌ల‌గం స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023లో.. ఉత్త‌మ న‌టుడు అవార్డు ప్రియ‌ద‌ర్శికి, ఉత్త‌మ సహాయ న‌టుడు అవార్డును కేతిరి సుధాక‌ర్ రెడ్డికి వ‌చ్చింది. ఇది నిజంగా గొప్ప ఎచీవ్‌మెంట్‌.

ఓ కుటుంబంలోని పెద్ద మ‌నిషి చ‌నిపోతే అక్క‌డ ఉండే మ‌నుషుల మ‌ధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాల చుట్టూ క‌థాంశంతో బ‌ల‌గం సినిమా రూపొందింది. ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప ల‌క్ష్మి, సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×