BigTV English

Viral Video: అమ్మ బాబోయ్.. బాత్ రూమ్‌లో కింగ్ కోబ్రా.. ఎక్కడో తెలుసా?

Viral Video: అమ్మ బాబోయ్.. బాత్ రూమ్‌లో కింగ్ కోబ్రా.. ఎక్కడో తెలుసా?

Viral Video: ఒక సాధారణ పల్లెటూరి ఉదయాన్నే మార్చేసిన వింతకథ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో ఒక ఇంటి బాత్రూమ్ తలుపు తెరిచిన వెంటనే అరుదైన అతిథి కనిపించాడు. అదేంటి బాత్రూమ్ లో అతిథి ఎవరబ్బా అనుకుంటున్నారా? ఎస్ మామూలు అతిథి కాదండో చూడగానే వెనక్కి కూడా తిరిగి చూడలేని అతిథి. అదే కింగ్ కొబ్రా! ఈ ఘటన ఎలా జరిగిందో, గ్రామస్తుల స్పందన ఏదైందో, అధికారులు ఈ ప్రమాదాన్ని ఎలా నియంత్రించారో పూర్తి వివరాలు ఇప్పుడు మీకు వినిపిస్తాం.


పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామం ఆగురు శివ అనే వ్యక్తి ఇంట్లో ఉదయం అలానే పనిమీద బాత్రూం తలుపు తీయగా… లోపల మెల్లగా కదులుతున్న పొడవైన నల్లని ఆ ఆకారం కనిపించింది. అది ఏదో తాడు అనుకున్న శివ… ఒక్క క్షణంలోనే అది కింగ్ కొబ్రా అని గుర్తించాడు. వెంటనే భయంతో కేకలు వేస్తూ బయటికి పరుగెత్తాడు. ఆ శబ్దం విన్న పొరుగు వాళ్లు ఏమైందో చూసేందుకు వచ్చారు. కానీ, బాత్రూం లోపల కదులుతున్న ఆ భారీ పాము చూసి వారూ వెంటనే పరుగులు పెట్టారు.

గ్రామం అంతా ఆ సర్పం వార్త క్షణాల్లో వ్యాపించింది. పిల్లలు, పెద్దలు అందరూ ఆ ఇంటి చుట్టూ చేరి, ఒక్కోరూ ఊపిరి బిగపట్టి చూస్తూ ఉన్నారు. ఎవరూ దగ్గరకి వెళ్లేందుకు సాహసం చేయలేదు. వెంటనే గ్రామస్తులు కురుపాం ఫారెస్ట్ రెంజర్ గంగరాజుకి సమాచారం అందించారు. గంగరాజు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన టీమ్‌తో అక్కడికి చేరాడు. కానీ, ఈ సర్పాన్ని పట్టుకోవడం అంత సులభం కాదని ఆయన అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే, కింగ్ కొబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. తప్పుగా హ్యాండిల్ చేస్తే… ప్రాణాలకు ముప్పు తప్పదు.


కాబట్టి, ఆయన వెంటనే విజయనగరం నుంచి ప్రత్యేకంగా స్నేక్ రెస్క్యూ టీమ్‌ను పిలిపించారు. గంటలోపే ఆ అధికారులు సంఘటనా స్థలానికి చేరి, జాగ్రత్తగా బాత్రూం తలుపు తెరిచి ఆ సర్పాన్ని పట్టుకునే ఆపరేషన్ మొదలుపెట్టారు. సుమారు అరగంట సేపు ఆ పాముతో పోరాడి, చివరికి దాన్ని సురక్షితంగా పట్టుకున్నారు. తరువాత, ఆ కింగ్ కొబ్రాను అడవిలో వదిలి పెట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Related News

Rain Types: బ్లడ్ రెయిన్, యానిమల్ రెయిన్.. ఈ వింతైన వానల గురించి మీకు తెలుసా?

Dog video: పిల్లలపై వీధి కుక్క దాడి.. హీరోలో వచ్చి కాపాడిన పెంపుడు కుక్క.. వీడియో వైరల్

Thief viral video: తాళం బ్రేక్ కాదు.. జస్ట్ ఇలా ఓపెన్! దొంగ ‘పెట్రోల్ ట్రిక్’తో పోలీసులు కూడా షాక్!

Engagement With AI: ఈ అమ్మాయికి ఇదేం పిచ్చి? AIతో ఎంగేజ్మెంట్.. 5 నెలలుగా డేటింగ్, చివరికి అది కూడా?

Viral Video: వాగేమో ఉధృతం, గంటలో పెళ్లి.. వద్దన్నా వినని పెళ్లికొడుకు.. ఇలా దాటేశాడేంటి!

Gold River: ఇది నిజమేనా! మన దేశంలో బంగారంతో నిండిన నది ఉందని తెలుసా?

Big Stories

×