Nidhhi Agerwal: తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ప్రభుత్వ వాహనంలో తిరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వాహనంపై చర్యలు తీసుకుంటామని జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి మోహన్ వెల్లడించారు. ఎల్లో నంబర్ ప్లేట్ ఉండాల్సిన దగ్గర వైట్ నంబర్ ప్లేట్ ఉందని, ఇలా నెంబర్ ప్లేట్ మార్చడం చట్టపరంగా నేరం అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ నిధి అగర్వాల్ తిరిగిన వాహనాన్ని ఇప్పుడు తెనాలిలో కనుగొన్నామని తెలిపిన కమిషనర్ మోహన్..ఈ వాహనం మీద గవర్నమెంట్ వాహనం అని ఉందని.. ఇక్కడ ట్రావెల్ చేసిన నిధి అగర్వాల్ కి కేస్ తో ఎటువంటి సంబంధం లేదు అని.. కారు డ్రైవర్ , ఓనర్ మీద మాత్రమే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..?
భీమవరంలో జరిగిన ఒక స్టోర్ ఈవెంట్ కి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ బోర్డు ఉన్న వాహనంలో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రభుత్వం తరఫున విధులు నిర్వహించాల్సిన అధికారులు, నాయకులు మాత్రమే ఈ వాహనాలను ఉపయోగిస్తారు. అధికారులు ఎవరూ తమ సొంత పనుల కోసం కూడా వీటిని వాడుకోవడానికి వీల్లేదు. అలాంటప్పుడు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్న వీడియో బయటకు రావడంతో అది కాస్త సంచలనంగా మారింది.
వివరణ ఇచ్చిన నిధి అగర్వాల్..
ఇకపోతే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీనిపై నిధి అగర్వాల్ వివరణ ఇచ్చింది. ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు జరిగిన పరిణామాలపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. అందుకే నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఈవెంట్ నిర్వాహకులు నాకోసం రవాణా సదుపాయం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిది..దానిని ఏర్పాటు చేసే విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులే నాకోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు రాశారు. అవన్నీ నిరాధారమైనవి. ప్రభుత్వాధికారులు ఎవరూ నాకు ఎలాంటి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయలేదు. నా ప్రియమైన అభిమానులకు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె ప్రమేయం ఏమీ లేదు కాబట్టే ఆ వాహన డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు కమిషనర్ మోహన్ వెల్లడించారు.
నిధి అగర్వాల్ సినిమాలు..
ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటించిన ఈమె… ఇప్పుడు ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఏడాది డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు.
ALSO READ:Shruti Haasan: బ్లాక్ కలర్ సెంటిమెంట్ వెనక ఇంత కథ ఉందా?