Viral Video: భారత్ లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియాలో అత్యధికంగా క్రికెట్ కి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. దేశంలో క్రికెట్ అభిమానుల సంఖ్య 14 కోట్లకు పైగానే ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కబడ్డీ, రెజ్లింగ్, ఫుట్ బాల్ ఉన్నాయి. ఈ మూడు గేమ్స్ కి సుమారు 3.2 నుండి 4.1 కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అయితే క్రికెట్ కి ఉన్న క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారు కొందరు యువకులు. వారు క్రికెట్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ కోసం డేంజర్ బౌలర్లను దించుతున్న టీమిండియా.. ఇక ప్రత్యర్ధులకు పీడ కలలే
అదేంటి.. అందరూ క్రికెట్ ఆడతారు కదా..! మరి ఈ యువకులు ఆడిన వీడియో ఎందుకు వైరల్ అయిందని ఆలోచిస్తున్నారా..? అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా క్రికెట్ ఆడేందుకు మైదానం ఉండాలి. అది కుదరకుంటే వీధుల్లో కాస్తంత సర్దుకుంటే ఆటను ఎంజాయ్ చేయవచ్చు. కానీ కొండలు, లోయలు, ఘాట్ రోడ్లపై కూడా క్రికెట్ లో మునిగి తేలాలంటే మాత్రం క్రికెట్ పై ఎనలేని అభిమానం ఉండాల్సిందే. అయితే వైరల్ గా మారిన ఈ వీడియోలో యువకులు తమకు క్రికెట్ పై సరిగ్గా ఇలాంటి వీరాభిమానమే ఉందని నిరూపించారు.
క్రికెట్ ఆడేందుకు వారికి అనువైన స్థలం లేకపోయినా వీళ్ళు వెనక్కి తగ్గలేదు. కొండపై ఉన్న ఓ సన్నని రోడ్డుపై కొందరు క్రికెట్ ఆడుతుంటే.. మరో కొండపై కొంతమంది కూర్చుని వారి ఆటను ఆస్వాదిస్తున్నారు. అయితే ఆ బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తి.. బంతిని బలంగా కొట్టినప్పుడు ఇక బంతి మళ్ళీ తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఆ బంతి లోయలో పడిపోతుంది. దీంతో మరో కొత్త బంతిని తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అతడు ఆడిన ప్రతి షాట్ తో ఆ బంతిని కోల్పోవాల్సిందే. దీంతో ఈ వీడియో చూసిన క్రీడాభీమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మ్యాచ్ ముగియాలంటే ఎన్ని బంతులు అవసరం పడతాయో..? అని కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో వైరల్ గా మారిన ఈ వీడియోని చూసి వారి క్రీడా స్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు నెటిజెన్లు. క్రికెట్ పట్ల వారికి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోని కేవలం వినోదానికి మాత్రమే కాకుండా.. క్రికెట్ పై వారికి ఉన్న ప్రేమను, ప్రకృతి సిద్ధమైన సవాళ్లను ఎదుర్కొంటూ కూడా తమ ఆటను ఆస్వాదించడానికి ఈ కుర్రాళ్ళు చూపించిన చొరవ నిజంగా అభినందనీయం. మూడు కొండల మధ్య క్రికెట్ ఆడుతూ.. క్రికెట్ పట్ల వారికి ఉన్న మక్కువను ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక ఈ వీడియోకు సహజంగానే కుప్పలు తెప్పలుగా వ్యూస్ వస్తున్నాయి. అలాగే రకరకాల కామెంట్లతో నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. క్రికెట్ మన రక్తంలోనే ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. ఇలాంటి క్రికెట్ తాము ఎక్కడా చూడలేదని మరికొందరు వ్యాఖ్యానించారు.
How many balls would be needed to complete a match in such places? pic.twitter.com/ziEXssHlwu
— Out Of Context Cricket (@GemsOfCricket) August 12, 2025