Big Stories

KL Rahul Advice to Justin Langer: చిక్కుల్లో కేఎల్ రాహుల్.. బీసీసీఐ సంజాయిషీ కోరుతుందా..?

KL Rahul advice to Justin Langer: టీమ్ ఇండియా కోచ్ పదవి అంటే.. వెయ్యి రెట్లు రాజకీయాలు ఎదుర్కోవాలి.. అనే మాట ఇప్పుడు నెట్టింట మార్మోగిపోతోంది. ఆస్ట్రేలియా హెడ్ కోచ్, లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ గా ఉన్న జస్టిన్ లాంగర్ చెప్పిన మాట నేడు భారత క్రికెట్ లో సెగలు పుట్టిస్తోంది. ఇంతకీ మాటన్నది ఎవరో కాదు, టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్, కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కావడంతో ఆ మాటకు హైప్ వచ్చింది. దీంతో నెట్టింట వేడి రాజుకుంది.

- Advertisement -

టీమ్ ఇండియా పైకి కనిపిస్తున్నంత అందంగా లేదా..?, టీమ్ ఇండియా వెనుక ఇన్ని రాజకీయాలున్నాయా? ఆటగాళ్ల ఎంపిక, జట్టు కూర్పు వెనుక ఒత్తిడులు ఉంటాయా? రికమండేషన్ క్యాండిట్లు ఉంటారా? అధికారపార్టీలో కొందరినీ మెప్పించాలా..? పవర్ పాలిటిక్స్ ప్రభావం టీమ్ ఇండియాపై అంత దారుణంగా ఉంటుందా..? కోట్లాది రూపాయలకు లెక్కలు ఉండవా..? ఆడిటింగ్ ఎవరు చేస్తారు..? ఎవరికి సమాధానం చెబుతారు..? ఈ లెక్కలన్నీ పబ్లిక్ డొమైన్ లో పెడతారా..?

- Advertisement -

స్వయం ప్రతిపత్తి సంస్థ కావడంతో వేల కోట్ల లెక్కలకు సమాధానాలేవి..? ఆర్టీఏ నుంచి అడిగితే సమాధానం ఇస్తారా..? అసలు లాభమెంత వస్తోంది..? ఖర్చెంత పెడుతున్నారు..? ఎంత మిగులుతోంది..? మీ సోకులకెంత..? మీ సొంపులకెంత..? ఎవరి పెత్తనం ఇక్కడ సాగుతోంది..? ఎవరినీ నోరెత్తనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నెట్టింట తీవ్రంగా ట్రోల్ అవుతున్నాయి.

Also Read: Mithali Raj – Shikhar Dhawan Marriage : ఇది నిజమేనా? మిథాలి రాజ్ తో.. శిఖర్ ధావన్ పెళ్లి?

ఏదో క్యాజువల్ గా రాహుల్ అన్నమాటలు టీ 20 ప్రపంచ కప్ ముందు ప్రకంపనలు స్రష్టిస్తోంది. ఇది రాహుల్ క్రీడా భవితవ్యంపై పెను ప్రమాదం చూపించే అవకాశాలు ఉన్నాయా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. బీసీసీఐలో ఎవరెంత కుళ్లబొడిచినా, ఎంత మానసికంగా హింసించినా, ఒక్క మాట కూడా బయటకి మాట్లాడకూడదనే కండీషన్ ఎప్పటినుంచో భారత క్రికెట్ లో ఉంది.

చాలామంది సీనియర్లు తమ కెరీర్ అంతా అయిపోయాక, శుభ్రంగా ఆడి, ఎంజాయ్ చేసి, అప్పుడు రిటైర్ అయి చెబుతుంటారు.అది కూడా చాలామంది చెప్పరు. ఎందుకంటే తర్వాత వారికి భవితవ్యం ఉండదు. కామెంటేటర్లు, కోచ్ లు, అవార్డులు, సన్మానాలు ఇలా ఎన్నో పదవులు ఉంటాయి. అవన్నీ వారు కోల్పోతారు. అందుకనే అందరూ అన్నీ మౌనంగా భరిస్తుంటారు.

Also Read: భారత ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ ఎవ్వరినీ సంప్రదించలేదు: జై షా

ఈ నేపథ్యంలో ఆల్రడీ టీ 20 ప్రపంచకప్ లో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ ని ఇక టీమ్ ఇండియాలోకి రానివ్వరనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇలా ఎంతో మంది క్రీడాకారుల జీవితాలతో బీసీసీఐ ఆటలాడిందనే సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా టెస్టు మ్యాచ్ లు ఆడలేదని శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను ఏం చేశారో అందరికీ తెలిసిందే. ఏకంగా వారిని బీసీసీఐ కాంట్రాక్టు నుంచే తప్పించారు. లాంగర్ ఎపిసోడ్ లో ఒకవేళ బీసీసీఐ పిలిచి, రాహుల్ ని సంజాయిషీ అడిగినా అడుగుతుందని అంటున్నారు.

నిజానికి బీసీసీఐలో ఏం జరుగుతుందనేది, తెలిసినా సరే, ఎవరూ నోరు విప్పి చెప్పకూడదు. నువ్వు ఆడు, ఆడకపో, నోర్మూసుకుని ఉండు…అదే నినాదం నిత్యం అక్కడ ఫరిడవిల్లుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల…కేఎల్ రాహుల్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందనే సందేహాలు నెట్టింట వినిపిస్తున్నాయి. అందుకనే నోరుని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. లాంగర్ మంచి కోసం చెప్పినా, ఇప్పుడు రాహుల్ మెడకి చుట్టుకుందని సీనియర్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News