E-Paper
Advertisement

Yash Raj Spy Universe Movies : యష్ రాజ్ స్పై మల్టీవర్స్ ..యాక్షన్ మూవీస్ తో బాలివుడ్ షేక్..

Yash Raj Spy Universe Movies : యష్ రాజ్ స్పై మల్టీవర్స్ ..యాక్షన్ మూవీస్ తో బాలివుడ్ షేక్..
Advertisement

Yash Raj Spy Universe Movies : యష్ రాజ్ ఫిలిమ్స్ .. గత కొద్ది కాలంగా స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ కి పెద్ద పీట వేస్తూ వస్తోంది. ఎక్కువ సక్సెస్ రేట్ ఇటువంటి చిత్రాలకే ఉండడంతో నిర్మాత ఆదిత్య చోప్రా వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏక్ ది టైగర్ అనే ఒక స్పై ఓరియంటెడ్ మూవీ ని ఈ సంస్థ మొదలుపెట్టింది. అయితే ఈ మూవీ బాగా క్లిక్ అవడంతో ఈ చిత్రానికి నెక్స్ట్ సీక్వెల్ గా టైగర్ జిందా హై మూవీ ని విడుదల చేశారు.

ఈ స్పై జోనర్ మూవీలో సల్మాన్ ఖాన్ ,కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సీరియస్ నుంచి వచ్చిన సెకండ్ సీక్వెల్ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో స్పై సీరీస్ ను కొనసాగిస్తూ రీసెంట్గా ఈ సంస్థ షారుక్ ఖాన్ తో పఠాన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. షారుక్ ఖాన్ తో పాటు దీపిక, జాన్ అబ్రహం కూడా ఈ మూవీలో నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడమే కాకుండా ఏకంగా వేయి కోట్లకి పైగా కలెక్షన్ తన ఖాతాలో వేసుకుంది.

Advertisement

రాబోయే క్రిస్మస్ సందర్భంగా ఆదిత్య చోప్రా తిరిగి మళ్లీ సల్మాన్, కత్రినా కాంబినేషన్ తో టైగర్ సిరీస్ మూడవ భాగం టైగర్ 3 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ మూవీ పై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఒకరకంగా యష్ సంస్థ మార్వెల్ సిరీస్ లాగా స్పై యూనివర్స్ క్రియేట్ చేస్తోంది. 

షారుక్ ఖాన్ పఠాన్ మూవీ లాస్ట్ లో టైగర్ క్యారెక్టర్ రివిల్ చేసి నెక్స్ట్ ఇక పఠాన్ వర్సెస్ టైగర్ అన్న క్లారిటీని ఇన్ డైరెక్ట్ గా ఇచ్చారు మేకర్స్.మరోపక్క హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన వార్ చిత్రం కూడా ఇదే రకమైన సిరీస్ గా మారుతుంది.టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో సీక్వెల్ గా వార్ 2 మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కి పోటీగా జూనియర్ ఎన్టీఆర్ నటించడం విశేషం. 

Advertisement

సల్మాన్ టైగర్ 3 మూవీలో షారుక్ తో పాటు హృతిక్ కూడా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే యష్ రాజ్ ఫిలిమ్స్ తమ చిత్రాలలోని ముగ్గురు రా ఏజెంట్స్ పాత్రలను కలపడం ద్వారా నెక్స్ట్ పఠాన్ యూనివర్స్ కొనసాగింపు చేయబోతున్నట్లు అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురిని ఎలా కలుపుతారు నెక్స్ట్ మూవీ ని ఎలా లీడ్ చేస్తారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×