BigTV English

YouTuber: లైంగిక వేధింపుల కేసులో మరో ఫేమస్ యూట్యూబర్.. అతడే ఆదర్శం..!

YouTuber: లైంగిక వేధింపుల కేసులో మరో ఫేమస్ యూట్యూబర్.. అతడే ఆదర్శం..!

YouTuber..ఆడవారికి పని ప్రదేశాలలోనే కాదు అసలు ఎక్కడా కూడా స్వేచ్ఛ లేదనేది వాస్తవం అంటూ ఇప్పటికే చాలామంది కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలలో కొంతమంది ఆ సెలబ్రిటీ హోదాను అడ్డుగా పెట్టుకొని చాలామంది అమ్మాయిలను ట్రాప్ చేసి, వారిపై లైంగికంగా అత్యాచారానికి కూడా పాల్పడుతున్నారు. ఒక ఘటన మరువకముందే ఇంకొక ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా మంచి పేరు తెచ్చుకున్న వారు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి పరువు పోవడమే కాదు అప్పటివరకు నిర్మించుకున్న స్థాయి కూడా కోల్పోతున్నారు అని చెప్పవచ్చు.


లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్..

ఇప్పటికే ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకున్న జానీ మాస్టర్ ఇండియాలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి , ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇలాంటి ఈయనపై లైంగిక ఆరోపణలు ఒక్కసారిగా ఈయన ఇమేజ్ ను దెబ్బతీశాయని చెప్పవచ్చు. మైనర్ పై లైంగిక వేధింపుల దాడి కేసులో ప్రస్తుతం చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉన్నారు జానీ మాస్టర్.


లైంగిక వేధింపుల కేస్ లో యూట్యూబర్ హర్ష సాయి కేస్ ఫైల్..

అయితే ఈ ఘటన మరువకముందే యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకున్న హర్ష సాయిపై కూడా లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ .2కోట్లు తీసుకొని మోసం చేశాడని, లైంగికంగా అత్యాచారానికి గురి చేశాడని, నగ్నంగా ఫోటోలు తీసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ బాధిత యువతి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ప్రస్తుతం ఇతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరో యూట్యూబర్ పై లైంగిక ఆరోపణలు..

అయితే ఈ ఘటనలు మరువకముందే ఇప్పుడు మరొక యూట్యూబర్ అత్యాచారం కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అతడు ఎవరో కాదు ప్రముఖ యూట్యూబర్ గా పేరు సొంతం చేసుకున్న మల్లిక్ తేజ్ (Mallik Tej) పై తాజాగా అత్యాచార కేసు నమోదు అయింది. మాయ మాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడు అంటూ బాధిత యువతి జగిత్యాల జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అంతేకాదు తరచూ ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఎవరీ మల్లిక్ తేజ్..

ఇక మల్లిక్ తేజ్ విషయానికి వస్తే.. మల్లిక్ తేజ్ ఫోక్ సింగర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. స్టార్ సింగర్ గా యూట్యూబ్లో చలామణి అవుతూ పేరు తెచ్చుకున్న మల్లిక్ తేజ్ పై ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం బాధిత యువతి తెలిపిన వివరాల మేరకు జగిత్యాల పోలీసులు ఇతడి పై రేప్ కేస్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాధిత యువతి జగిత్యాల జిల్లా పోలీసుల ఎదుట తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కూడా దుర్భాషలాడాడని , తనను వేధిస్తున్నాడు అంటూ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. మరి మల్లిక్ తేజ్ ఈ విషయాలపై స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. మొత్తానికైతే ఈ విషయాలు వింటున్న నెటిజన్స్ హర్ష సాయిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి యూట్యూబర్స్ ఒక్కొక్కరిగా బయటపడుతున్నారా ఏంటి అంటూ కామెంట్ లు చేస్తున్నట్లు సమాచారం.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×