BigTV English

Aksathamurthys : ఏడాదికి 100 కోట్లు.. అక్షతామూర్తి ఆదాయం అదుర్స్..

Aksathamurthys : ఏడాదికి 100 కోట్లు.. అక్షతామూర్తి ఆదాయం అదుర్స్..

Aksathamurthys : అక్షతామూర్తి. బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సతీమణి. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు. తండ్రి నుంచి వారసత్వంగా ఇన్ఫీ షేర్ల రూపంలో భారీగా సంపద వచ్చిపడింది. ఎంత అంటే.. ఏడాదికి ఏకంగా 100 కోట్లకు పైగా డివిడెంట్ వచ్చేంత.


అవును, మీరు చదివింది నిజమే. ఏడాదికి అక్షరాలా వంద కోట్లకు పైగా ఆదాయం ఆమెకు వస్తోంది. 2022లో ఆమెకు 126 కోట్ల డివిడెండ్ రాగా.. అంతకు ముందు 2021లో 120 కోట్ల ఆదాయం వచ్చిపడింది. అదంతా ఇన్ఫోసిస్ షేర్ల నుంచే.

అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల (0.93 శాతం) షేర్లు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలుప ప్రకారం.. ఆ వాటా విలువ సుమారు 6వేల కోట్లు. ఈ ఏడాది ఒక్కో షేరుపై రూ.32.5 చొప్పున డివిడెంట్ ఇచ్చింది ఇన్ఫీ. ఆ లెక్కన అక్షతకు ఉన్న 3.89 కోట్ల షేర్లకు గాను.. ఈ ఏడాదికి మొత్తం 126.61 కోట్ల ఆదాయం లభించింది. 2021లో షేరుకు రూ.30 డివిడెండ్‌ ఇవ్వగా.. ఆమెకు రూ.119.5 కోట్ల ఇన్ కమ్ వచ్చింది.


ఇండియన్ సిటిజన్ గానే బ్రిటన్ లో ఉంటున్న అక్షతామూర్తి.. బ్రిటన్ లో నాన్-డొమిసైల్ హోదాలో పన్ను రాయితీ పొందేవారు. అంటే, వారు విదేశాల్లో సంపాదించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టనక్కరలేదు. ఇది చట్టబద్ధ పన్ను రాయితీనే. అయినా, ప్రతిపక్షం ఇటీవల ఈ విషయంలో రిషి సునాక్ ను బాగా కార్నర్ చేయడంతో.. అక్షతామూర్తి నాన్-డొమిసైల్ హోదాని వదులుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్జిస్తున్న ఆదాయంపై ఇకపై బ్రిటన్‌లోనూ పన్ను చెల్లిస్తానని ప్రకటించారు. అంటే, ఈ ఏడాదికి వచ్చిన 126 కోట్లకు గాను అక్షత బ్రిటన్ లోనూ పన్ను కట్టనున్నారు.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×