Big Stories

WhatsApp : గంటన్నరకే గిలగిలా…

WhatsApp : ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు గంటన్నర సేపు వాట్సప్ సేవలు నిలిచిపోవడంతో… యూజర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం 12.30 తర్వాత… వాట్సప్‌లో పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్‌ చూపించకపోవడంతో పాటు… డబుల్‌ టిక్‌, బ్లూ టిక్‌ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్‌ వెళ్లిందా? లేదా? అని యూజర్లు గందరగోళానికి గురయ్యారు. సమస్యను గుర్తించిన వెంటనే వేల మంది యూజర్లు వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు చేశారు. మెసేజ్‌లు పంపడంలో సమస్యలు ఎదుర్కొన్నామని కొందరు… సర్వర్ సంబంధిత సమస్యలు ఉన్నాయని మరికొందరు… బ్లూ టిక్‌ కనిపించడం లేదని ఇంకొందరు ఫిర్యాదుల్లో రాసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ పనిచేయడం లేదంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి. వాట్సప్‌ ఎర్రర్‌, వాట్సప్‌ డౌన్‌ హ్యాష్‌ట్యాగ్స్‌ ట్రెండింగ్‌లో నిలవడంతో… వాట్సప్ మాతృ సంస్థ మెటా స్పందించింది.

- Advertisement -

మెసేజెస్‌ పంపడంలో కొందరు యూజర్లకు సమస్య ఉన్నట్లు గుర్తించామని, వాటిని వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని మెటా వెల్లడించింది. త్వరలోనే అందరికీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని… యూజర్లెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. హామీ ఇచ్చినట్లు గానే… గంటర్నర తర్వాత వాట్సప్ సేవలు ఎలాంటి సమస్యలు లేకుండా అందుబాటులోకి వచ్చాయి. దాంతో.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత యథావిథిగా వాట్సప్ సేవల్ని వినియోగించుకోవడం ప్రారంభించారు… యూజర్లు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News