Rashmika mandanna:ఈ మధ్యకాలంలో స్టార్ డైరెక్టర్స్ దగ్గర దర్శకత్వంలో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు గొప్ప గొప్ప చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అలా ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని,మళ్ళీ నాని తో ది ప్యారడైజ్ చిత్రంతో సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెంచగా.. ఇప్పుడు హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవీంద్ర పుల్లె దర్శకుడిగా మారి టాలీవుడ్ కి పరిచయమవుతూ చేస్తున్న చిత్రం మైసా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna)లీడ్ రోల్ లో.. అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా మైసా.
మునుపెన్నడు లేని విధంగా వైవిద్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రష్మిక. ఇకపోతే పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అధికారికంగా ప్రకటించారు . అటు రష్మిక కూడా అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. నవంబర్ 27 2026న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా తెలుగు , తమిళ్, హిందీ , మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఒక పోస్టర్ విడుదల చేయగా.. వీరనారి గెటప్ లో ఈటె పట్టుకొని.. చీర కట్టులో రక్తం మడుగుల్లో రష్మిక కనిపించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఆమె ముందు మహిళలు కత్తులతో కనిపించారు. వీరనారీమణులు యుద్ధరంగంలో విజృంభిస్తున్న తీరు సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇకపోతే ఈ చిత్రానికి అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి గోపా సహ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్లోనే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా తుంటి కాలు వద్ద గాయం కాగా నెల రోజులకు పైగా రష్మిక విశ్రాంతి తీసుకుంటుంది . అయితే ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించింది. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
also read:పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!
మరోవైపు రష్మిక మందన్న తన భర్తతో కలిసి రణబాలి అనే సినిమా చేస్తోంది . రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలనుకున్నారు . కానీ షూటింగ్ పోస్ట్ పోన్ కావడంతో ఇప్పుడు అక్టోబర్ 16 కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇకపోతే రష్మిక మందన్న తన భర్తతో కలిసి నటిస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి . ముఖ్యంగా వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. మరి ఈ జంటకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.