E-Paper
Advertisement

Papua New Guinea : పపువా న్యూ గినియాలో అల్లర్లు.. 15 మంది మృతి

Papua New Guinea : పపువా న్యూ గినియాలో అల్లర్లు.. 15 మంది మృతి
Advertisement
Papua New Guinea

Papua New Guinea : అల్లర్లు, దహనాలు, లూటీలతో పపువా న్యూ గినియా అట్టుడికింది. రాజధాని పోర్ట్ మోర్స్‌బీ ప్రజ్వరిల్లిన హింసకు 15 మంది బలయ్యారు. దుకాణాలు, కార్లను తగులబెట్టారు. సూపర్ మార్కెట్లలో యథేచ్ఛగా లూటీ కొనసాగింది. వేతనాలకు సంబంధించి పోలీసులు సమ్మెలోకి వెళ్లిన దరిమిలా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి.

చట్టాలను ఉల్లంఘిస్తే ఎంత మాత్రం సహించబోమని ప్రధాని జేమ్స్ మరాపీ ప్రజలను హెచ్చరించారు. రాజధాని మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకూ హింస పాకింది. పోర్ట్ మోర్స్‌బీలో 8 మంది చనిపోగా.. లే నగరంలో మరో ఏడుగురు మృతి చెందారు. పోలీసులు, ప్రభుత్వ అధికారుల వేతనాల్లో సగం వరకు కోత పడటంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం పార్లమెంట్ వద్ద నిరసనలకు దిగారు.

Advertisement

అయితే కంప్యూటర్ల పొరపాటు వల్ల ప్రభుత్వ సిబ్బంది జీతాలు దాదాపు రూ.8 వేలు తక్కువగా పడ్డాయే తప్ప.. పన్నుల పెంపు వల్ల కాదని ఉద్యోగులకు నచ్చచెప్పారు. కాగా.. పపువా న్యూ గినియా ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ద్రవ్యోల్బణం 8 శాతానికి, నిరుద్యోగిత రేటు 2.5 శాతానికి చేరుకుంది. ఏడాదిగా ఈ పసిఫిక్ ద్వీప దేశంలో నేరాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇక్కడ క్రైం ఇండెక్స్ 80.79కి చేరింది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×