BigTV English

Maldives Controversy: మాల్దీవుల వివాదం.. సినిమా షూటింగులు రద్దు.. FWICE ప్రకటన..

Maldives Controversy: మాల్దీవుల వివాదం.. సినిమా షూటింగులు రద్దు.. FWICE ప్రకటన..

Maldives Controversy: మాల్దీవులు VS లక్షద్వీప్ వివాదం కొనసాగుతోంది. ఆ దేశ మంత్రులు భారతీయులపై చేసిన కామెంట్లు.. అక్కడి టూరిజాన్ని దెబ్బతీశాయి. ఇప్పటికే వేలాది హోటల్ బుకింగ్స్ రద్దయ్యాయి. పలు సంస్థలు మాల్దీవుల ట్రిప్పులనే ఆపేశాయి. ఫలితంగా భారతీయుల దెబ్బ ఎలా ఉంటుందో.. మాల్దీవ్స్ ప్రభుత్వం చవిచూస్తోంది. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.


మాల్దీవుల్లో షూటింగులని ఆపివేయాలని చిత్ర నిర్మాతలందరికీ విజ్ఞప్తి చేసింది. ఫిల్మ్ మేకర్స్ మాల్దీవుల్లో షూటింగ్ చేయడానికి బదులుగా.. దేశంలోని ఇతర ప్రదేశాల్లో సినిమాను చిత్రీకరించాలని పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరింది.

FWICE విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇలా చెప్పింది. మాల్దీవ్స్ ముగ్గురు మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మీడియా, పరిశ్రమలో పనిచేసే కార్మికులు, సాంకేతిక నిపుణులు, కళాకారుల సమఖ్య కలిసి FWICE ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి మోదీకి సంబంధించి మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లను FWICE ఖండిస్తుందని తెలిపింది.


భవిష్యత్ లో మాల్దీవుల్లో ఎలాంటి షూటింగ్ లు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. భవిష్యత్ లో మాల్దీవుల్లో షూటింగ్ లు ప్లాన్ చేయవద్దని నిర్మాతలకు సూచించింది. మన ప్రధానికీ దేశానికీ మనం అండగా ఉందామని FWICE ప్రకటనలో పేర్కొంది.

.

.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×