BigTV English

Amazon Rainforest: కాకులు దూరని కారడవిలో 31 రోజులు పోరాటం.. చివరికి..

Amazon Rainforest: కాకులు దూరని కారడవిలో 31 రోజులు పోరాటం.. చివరికి..

Amazon Rainforest: కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి. అలాంటి అడవిలో ఒంటరిగా జీవించాల్సి వస్తే.. కొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తే. అమ్మో ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది కదూ.. కానీ ఓ వ్యక్తికి అలాంటి అడవిలో ఉండాల్సి వచ్చింది. అది కూడా ఒంటరిగా. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా నెల రోజులు. తినడానికి తిండి లేదు.. తాగడానికి నీరు లేదు. మానవ మనుగడే లేదు.. దానికి తోడు ఎటునుంచి ఏ జంతువు దాడి చేస్తుందో తెలీదు. ఏ పురుగు కుడుతుందో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి జీవించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అతను ఎవరంటే..


బొవీలియాకు చెందిన నలుగురు స్నేహితులు ప్రపంచంలోనే అతిపెద్ద అడవి అయిన అమెజాన్ ఫారెస్ట్‌కు వేటకు వెళ్లారు. జనవరి నెల చివరలో ఫారెస్ట్‌లోకి ఎంట్రీ అయ్యారు. కొన్ని రోజులకు వారి నుంచి జోనాటన్ అకోస్టా అనే వ్యక్తి తప్పిపోయాడు. అతని స్నేహితులు జోనాటన్ కోసం ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు. ఇక చివరికి చేసేది ఏమీ లేక వాళ్లు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇక జోనాటన్ అకోస్టా మాత్రం అడవిలో నుంచి బయట పడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా కూడా బయట పడే మార్గం మాత్రం కనిపించడం లేదు. ఎటు చూసినా.. దట్టమైన అడవి.. చెట్లు.. దానికి తోడు భారీ వర్షం. ఎంత దూరం ప్రయాణించినప్పటికీ తిరిగి మళ్లీ అక్కడే చేరుకుంటున్నాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ బయటపడే మార్గం కనిపించకపోవడంతో అతనిలో భయం మొదలైంది.


ప్రాణాలతో భయటపడేందుకు అడవిలో దొరికే పండ్లు పలాలతో పాటు కీటకాలను తిన్నాడు. తన రబ్బర్ షూలతో వర్షపు నీటిని పట్టుకొని దాహం తీర్చుకున్నాడు. కొన్ని సార్లు వర్షం పడకపోవడంతో తన మూత్రం తానే తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. కీటకాలు కరిచినప్పటికీ, జంతువులు దాడి చేసినప్పటికీ ముందుకు అడుగులేస్తూ వెళ్లాడు.

చివరికి పోయిన శనివారం రెస్క్యూ సిబ్బంది అతడిని గుర్తించారు. క్షేమంగా అడవిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరిగి తన ఫ్యామిలీని కలుసుకోవడంతో అకోస్టా సంతోషం వ్యక్తం చేశాడు. మళ్లీ ఎప్పుడూ వేటకు వెళ్లనని వెల్లడించాడు.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×