E-Paper
Advertisement

Plane Crash: మెక్సికోలో పెను విషాదం.. కుప్పకూలిన విమానం.. స్పాట్‌లో 10 మంది మృతి

Plane Crash: మెక్సికోలో పెను విషాదం.. కుప్పకూలిన విమానం.. స్పాట్‌లో 10 మంది మృతి
Advertisement

Plane Crash: మెక్సికోలో పెను విషాదం చోటుచేసుకుంది. మెక్సికో సిటీకి పశ్చిమాన ఉన్న టోలుకా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక మినీ జెట్ విమానం కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బందితో సహా దాదాపు 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ విమానం పసిఫిక్ తీరంలోని సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అకాపుల్కో నుంచి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. అయితే సాకర్ మైదానంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మినీ జెట్‌‌ ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. పరిస్థితి విషమంగా మారడంతో విమాన పైలెట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సమీపంలో ఉన్న ఒక ఫుట్‌బాల్ స్టేడియం ఖాళీగా ఉండటాన్ని గమనించి, అక్కడే విమానాన్ని దించాలని పైలెట్ ప్రయత్నించాడు. అయితే, ల్యాండింగ్ ప్రక్రియలో పరిస్థితులు అదుపు తప్పాయి. విమానం గ్రౌండ్‌ను చేరుకోకుండా, పక్కనే ఉన్న ఒక కంపెనీ భవనం పైకప్పుపై బలంగా పడింది.

Advertisement

భవనం పైకప్పుపై పడిన వెంటనే ఆ మినీ జెట్ పెద్ద శబ్దంతో పేలిపోయింది, దీంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన అధికారులు, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విమాన శకలాలను, మృతదేహాలను వెలికితీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also Read: హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై యాక్సిడెంట్, ట్రాఫిక్ జామ్.. అటు పల్నాడులోను..

Advertisement

ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు మెక్సికో విమానయాన భద్రతా సంస్థ (Aviation Safety Board) దర్యాప్తునకు ఆదేశించింది. సాంకేతిక లోపం స్వభావం ఏమిటి, పైలెట్ అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం ఎందుకు విఫలమైంది అనే అంశాలపై నిపుణులు దృష్టి సారిస్తున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన అధికారులు, పూర్తి వివరాలు వెల్లడైన తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×