E-Paper
Advertisement

Road Accidents: హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై యాక్సిడెంట్, ట్రాఫిక్ జామ్.. అటు పల్నాడులోను..

Road Accidents: హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై యాక్సిడెంట్, ట్రాఫిక్ జామ్.. అటు పల్నాడులోను..
Advertisement

Road Accidents: వరుస రోడ్డు ప్రమాదాలు.. ఒకే రోజు ఉదయాన్నే మూడు ప్రమాదాలు.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు.. పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో జమ్మలమడుగు హైవేపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్ర గాయాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్పందించిన స్థానికులు, సహాయక బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్‌లో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు హైవేపై రైతులు ధాన్యం ఆరబోసి ఉండటం, అదే సమయంలో కారు అతి వేగంతో దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్‌తో వస్తున్న కారు డ్రైవర్‌ ధాన్యం పోసి ఉన్న విషయాన్ని గమనించ లేకపోయాడు. దీంతో నియంత్రణ కోల్పోయిన కారు ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరణించిన మహిళ వివరాలు, గాయపడిన వారి పూర్తి గుర్తింపు, డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ఆరా తీస్తున్నారు.

Advertisement

మరో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్ పై ఢీకొన్న 3 కార్లు..

Advertisement

ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఉదయం పూట ఏర్పడిన దట్టమైన పొగమంచు కారణంగా ముందున్న వాహనాలు సరిగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, దెబ్బతిన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనదారులు పొగమంచు సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×