E-Paper
Advertisement

Air India : ఎయిరిండియా బాటలో ఇతర విమానయాన సంస్థలు

Air India : ఎయిరిండియా బాటలో ఇతర విమానయాన సంస్థలు
Advertisement

Air India : భారత ప్రభుత్వం నుంచి ఎయిరిండియా టాటాల చేతుల్లోకి వచ్చాక… ఒకేసారి 840 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇవ్వడం… ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం సృష్టించింది. ఈ భారీ డీల్ చూసి… విమానయాన రంగం మొత్తం నోరెళ్లబెట్టింది. అయితే… ఎయిరిండియా మాదిరే ఇతర విమానయాన సంస్థలు కూడా కొత్త విమానాల కోసం త్వరలో భారీ ఆర్డర్ ఇవ్వబోతున్నాయనే వార్త… మరింత సంచలనం సృష్టిస్తోంది.

ఎయిరిండియా మినహా దేశంలోని ఇతర విమానయాన సంస్థలన్నీ వచ్చే రెండేళ్లలో మొత్తం 1200 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ ఇండియా-CAPAI ప్రకారం… ఇండిగో సహా మిగతా విమానయాన సంస్థలు కొత్త విమానాలు సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఫ్లీట్ రీప్లేస్‌మెంట్, అభివృద్ధి ప్రణాళికలో భాగంగా… వచ్చే రెండేళ్లలోనే వీలైనన్ని కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ సర్వీసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కరోనా కన్నా ముందే 300 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇవ్వాలని ఇండిగో భావించినా… మహమ్మారి కారణంగా చాలా రోజుల పాటు కార్యకలాపాలు స్తంభించడంతో… ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులన్నీ కుదుటపడటంతో… మొత్తం 500 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇవ్వాలని ఇండిగో భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Advertisement

అయితే, విమానయాన సంస్థలు ఇలా ఆర్డర్ ఇచ్చిన వెంటనే అలా కొత్త విమానాలు ఎగిరి వస్తాయనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే… గత డిసెంబర్ 31 నాటికే ఎయిర్‌బస్, బోయింగ్‌ సంస్థల దగ్గర 12,669 కొత్త విమానాల ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయి. సప్లై చైన్ సమస్యల కారణంగా తగినన్ని ఇంజిన్లు అందుబాటులో లేకపోవడంతో… ఎయిర్‌ఫ్రేమ్ సిద్ధంగా ఉన్నా విమానాలు డెలివరీ చేయలేని పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా సమస్యలన్నీ తొలగిపోయి… కొత్త విమానాల డెలివరీ ఊపందుకోవచ్చని భావిస్తున్నారు. అయినా… ఇప్పుడున్న ఆర్డర్ల మేరకు కొత్త విమానాలన్నీ డెలివరీ చేయాలంటే మరో ఆరేళ్లు పడుతుందని భావిస్తున్నారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×