E-Paper
Advertisement

అయితుల్లా ఖమేనీ భౌతికకాయం.. 125 రోజులు ఎలా ఉంచింది, కెమికల్స్‌పై నిషేధం, ఏయే పద్దతులు వినియోగించింది?

అయితుల్లా ఖమేనీ భౌతికకాయం.. 125 రోజులు ఎలా ఉంచింది, కెమికల్స్‌పై నిషేధం, ఏయే పద్దతులు వినియోగించింది?
Advertisement

Khamenei Body 125 Days: ఇరాన్ దివంగత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనుంది ఆదేశం. దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. నాలుగు నెలలపాటు ఖమేని మృతదేహాన్ని ఎలా భద్రపరిచింది? ఇస్లామిక్ శాస్త్రాలలో రసాయనాల వినియోగంపై నిషేధాలు ఉన్నాయి. ఈ పద్దతిని ఉపయోగించింది? అన్నదే అసలు ప్రశ్న.

అయితుల్లా ఖమేనీ భౌతికకాయం 125 రోజులు ఎలా సాధ్యం

Advertisement

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ. ఆయన అధికారిక అంత్యక్రియలు టెహ్రాన్‌లో ప్రారంభమైంది. యుద్ధం జరిగి నాలుగు నెలలు గడిచింది, అంటే దాదాపు 125 రోజులు. సుదీర్ఘ కాలం పాటు ఆయన భౌతిక కాయాన్ని ఎలా భద్రపరిచింది?

అంత్యక్రియల కార్యక్రమాలు టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా వేదికగా జరుగుతోంది. ఓ వైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు యుద్ధ వాతావరణం నేపథ్యంలో కఠినమైన ఇస్లామిక్ సాంప్రదాయాలను పాటించింది. డెడ్ బాడీ ఇన్నాళ్ల పాటు పాడవకుండా ఉంచడం అంతర్జాతీయ ఫోరెన్సిక్ నిపుణులు ఆశ్చర్యపడుతున్నారు.

Advertisement

మృతదేహాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి వివిధ రసాయనాలు ఉపయోగిస్తారు. అంటే బాడీకి ఎంబాల్మింగ్ ప్రక్రియ చేస్తారు. ఖమేనీతోపాటు మరణించిన నలుగురు కుటుంబ సభ్యుల శరీరాలకు ఎలాంటి రసాయనాలు వినియోగించలేదు ఇరాన్. అత్యాధునిక రెఫ్రిజరేటెడ్ మెడికల్ కోల్డ్ స్టోరేజ్‌ని ఉపయోగించారు.

కెమికల్స్ లేకుండా ఏయే పద్దతులు పాటించింది ఇరాన్

అత్యధిక సాంకేతికత టెక్నాలజీని ఇందుకోసం ఇరాన్ ఉపయోగించింది.నార్మల్‌గా అయితే సున్నీ-షియా ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం మృతదేహానికి రసాయనాలు ఎక్కించడం నిషేధం. ఎంబాల్మింగ్ ప్రక్రియలో శారీరక ద్రవాలను తొలగించి ఫార్మాల్డిహైడ్ ఆధారిత రసాయనాలను పంపిస్తారు. అలా చేస్తే మృతుల పవిత్రతను దెబ్బతీయడమని ఇస్లామిక్ శాస్త్రాలు చెబుతున్నాయి.

రసాయనాలు లేకుండా శరీరం పాడవకుండా ఉండేందుకు హై ప్రిసిషన్ మెడికల్ రిఫ్రిజరేషన్ యూనిట్లను ఉపయోగించింది ఇరాన్. ఈ యంత్రాల ద్వారా ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెలియన్స్ నుంచి 4 డిగ్రీల మధ్య ఉంచారు. శరీరం ఎండిపోకుండా, విచ్ఛిన్నం కాకుండా ఉండేలా హ్యుమిడిటీ స్థాయిలను కచ్చితత్వంతో నియంత్రించారు. ఖమేనీతోపాటు కూతురు-అల్లుడు, కోడలు, 14 నెలల మనవరాలి శరీరాలను ఈ పద్ధతిలో భద్రపరిచారు.

ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మృతి చెందిన 24 గంటల లోపు అంత్యక్రియలు పూర్తి చేయాలి. ఇరాన్ మత పెద్దలు షియా ఇస్లామిక్ చట్టాలలో ప్రత్యేక మినహాయింపులు ఉపయోగించారు. యుద్ధ వాతావరణం, భద్రతాపరమైన ముప్పు, మృతదేహాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించలేని అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు.. అంత్యక్రియలను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.

ALSO READ: అయితుల్లా ఖమేనీ భౌతికకాయం 125 రోజులు ఎలా సాధ్యం..  కెమికల్స్‌పై నిషేధం, ఏయే పద్దతులు వినియోగించింది? 

అందుకు షియా చట్టం అనుమతిస్తుంది. ఖమేనీ అత్యున్నత మత నాయకుడు కావడంతో ఈ ప్రత్యేక మినహాయింపు ఇరాన్ ప్రభుత్వానికి తేలికైంది. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మైదానంలో వీడ్కోలు సభల్లో భౌతికకాయం పాడవకుండా ఉండేలా అత్యాధునిక రక్షణ వలయం ఏర్పాటు చేశారు అధికారులు. ఎందుకంటే 1989లో అయతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియల సమయంలో జనం పోటెత్తారు.

2020లో జనరల్ ఖాసెమ్ సులేమానీ అంత్యక్రియల వద్ద జరిగిన తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో ఖమేని అంత్యక్రియల విషయంలో జాగ్రత్తగా చర్యలు చేపట్టింది ఇరాన్ ప్రభుత్వం. శవపేటికను ఒక ప్రత్యేకమైన క్లైమేట్ కంట్రోల్డ్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఇరాన్ జాతీయ జెండా, తలపాగా ఉంచిన శవపేటికను అభిమానులు దూరం నుంచి సందర్శించడానికి అవకాశం కల్పించారు. శవపేటిక లోపల వాతావరణం చల్లగా ఉండి శరీరం పాడవకుండా ఉంటుంది. బహుశా అన్నిరోజులు భౌతికకాయాన్ని పాడవకుండా ఉంచిన నేత అయతుల్లా అలీ ఖమేనీ కావచ్చని చెబుతున్నారు.

Related News

మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!

ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. జైలు నుంచి ఆస్పత్రికి.. పాక్ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

భారత ఎన్నికల వ్యవస్థ అమోఘం.. అమెరికా చూసి నేర్చుకోవాలి.. ట్రంప్ ప్రశంసల వర్షం!

పాకిస్తాన్‌లో ఘోరం.. ప్రముఖ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య.. చెల్లెలికి తీవ్ర గాయాలు!

అమెరికా సైనికుడిని పట్టిస్తే భారీ రివార్డ్.. మహిళలకైతే డబుల్ ఆఫర్ ఇచ్చేసిన ఇరాన్!

ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం.. ప్రభుత్వాలకు సెన్సార్ షాక్, అసలు మేటరేంటి?

మిచిగాన్‌లో వరుస హత్యలు.. ఆరుగురు మృతి, వారిలో నిందితుడు కూడా, ఏం జరిగింది?

ఆగస్టు 15న భారత్‌కే కాకుండా.. ప్రపంచంలో ఇంకా ఏయే దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది?

Big Stories

Advertisement
×