E-Paper
Advertisement

మందు బాబులను వెంటాడే 5 డ్యాన్స్ దెయ్యాలు… మస్ట్ వాచ్ మలయాళం హర్రర్ కామెడీ డ్రామా

మందు బాబులను వెంటాడే 5 డ్యాన్స్ దెయ్యాలు… మస్ట్ వాచ్ మలయాళం హర్రర్ కామెడీ డ్రామా
Advertisement

Malayalam Horror Comedy: మందుబాబులు వేసే తైతక్కలకు మనుషులకే విసుగొస్తుంది. అలాంటి వారిని దెయ్యాలు విసిగిస్తే, వెంటపడి వేధిస్తే… ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తే… అదే ‘కరక్కం’ (Karakkam) మూవీ స్టోరీ. శ్మశానంలో తాగి రచ్చ చేసిన ఇద్దరు యువకులు, వారిని వెంటాడే ఐదుగురు డ్యాన్స్ దయ్యాల కథ. 2026 మే 28న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళ హారర్-కామెడీ-మ్యూజికల్ చిత్రం. సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళ సినిమాలో మొట్టమొదటి పూర్తి స్థాయి మ్యూజికల్ హారర్ కామెడీ మూవీ. శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ స్టోరీపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కొచ్చి నగరంలో బాధ్యతలు లేకుండా తిరుగుతుంటారు ధనుష్ (శ్రీనాథ్ భాసి), ఖాజా (ప్రవీణ్ టి.జె.). ధనుష్ ఒక పేద డాన్సర్. జీవితం అంతా ఎలాగోలా సాగిస్తూ ఉంటాడు. న్యూ ఇయర్ రాత్రి, వాళ్ళు ఉండే ‘అంబికా లాడ్జ్’లో పెద్ద గొడవ జరుగుతుంది. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ ఆ గొడవ నుండి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న పాత చర్చి శ్మశానంలోకి పరుగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ పూర్తి మత్తులో ఉన్న ధనుష్ ఒక వింత పని చేస్తాడు. శ్మశానంలోని ఐదు సమాధులపై ఉన్న పవిత్రమైన ఇత్తడి సిలువలను పీకేసి విసిరేస్తాడు.

Advertisement

ఇక్కడే కథలో మలుపు మొదలవుతుంది. ఆ రాత్రి వాళ్ళు చేసిన పని వల్ల ఆ ఐదు సమాధుల నుండి ఐదు అశాంత ఆత్మలు మేల్కొంటాయి. మరుసటి రోజు నుండి ఆ దయ్యాలు ధనుష్, ఖాజాలను వెంటాడటం మొదలు పెడతాయి. కానీ ఇవి సాధారణ హారర్ సినిమాల్లోలా భయంకరంగా ఉండవు. ఈ దయ్యాలు చాలా కలర్‌ఫుల్‌గా, ఎనర్జీతో నిండి, అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ వీరిద్దరి జీవితాన్ని నిలకడ లేకుండా మార్చేస్తాయి.

లాడ్జ్ రూమ్‌లోనే తిష్టవేసి, వారిని ఎక్కడికి వెళ్లనీయకుండా వేధిస్తాయి. ధనుష్, ఖాజాలు ఈ భయంకర తలనొప్పి నుండి తప్పించుకోవాలంటే ఆ ఆత్మల గతం తెలుసుకోవాల్సి వస్తుంది. ఆ ఐదుగురు ఆత్మలు గతంలో సమాజంలోని దుర్మార్గుల వల్ల అన్యాయంగా చనిపోయినవారని తెలుస్తుంది. తమ ప్రతీకారం తీర్చుకోవాలని, తమ ఆత్మలకు శాంతి కలగాలని ఎదురు చూస్తున్నాయి ఆ దెయ్యాలు. సమాధులపై ఉన్న సిలువలు తొలగిపోవడంతో వారు చర్చి పరిధిని దాటి బయటకు వచ్చి ప్రతీకారం తీర్చుకునే శక్తిని పొందుతారు.

Advertisement

ఇక్కడి నుండి ధనుష్, ఖాజాలు ఆ దయ్యాలకు విముక్తి కలిగించడానికి ఒక సాహసోపేతమైన జర్నీ ప్రారంభిస్తారు. ఈ ప్రయాణంలో దయ్యాల డ్యాన్స్ సీక్వెన్స్‌లు, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతాయి. మరి ఇంతకీ ఆ దెయ్యాలు ఎలా పగ తీర్చుకున్నాయి ? అందుకోసం హీరోలు చేసిన హెల్ప్ ఏంటి ? చివరకు ఏమైంది ? అన్నది స్టోరీ.

తెలుగులోనూ స్ట్రీమింగ్

ఫెమినా జార్జ్, సిద్ధార్థ్ భరతన్, షాన్ రోమీ, అబిరామ్ రాధాకృష్ణన్‌లు ముఖ్య పాత్రల్లో నటించిన ‘కరక్కం’ ప్రస్తుతం Sony LIVలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. జూలై 3 నుండి అందుబాటులోకి వచ్చింది. హారర్, కామెడీ, మ్యూజిక్ కలిపి ఉన్న కాక్‌టైల్ లాంటి మూవీ. డోంట్ మిస్.

Read Also : సిటీ బ్లాస్ట్ ప్లాన్ ను ఆపడానికి పాస్ట్ లోకి… మిస్టీరియస్ మనిషి ఎంట్రీతో అడ్డం తిరిగే కథ

Tags

Related News

ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మూకుత్తి అమ్మన్ 2.. భారీ ధరకు అమ్ముడుపోయిన ఓటీటీ హక్కులు!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాల సందడి.. డోంట్ మిస్..

పుట్టగానే ఆసుపత్రిలోనే బిడ్డను వదిలేసి వెళ్ళే తల్లి… గుండెను బరువెక్కించే ఈ ఎమోషనల్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి తెలుగులో సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్… కిల్లర్ ఎవరో చివరి వరకు కనిపెట్టలేరు

విమానం కూలిన తర్వాత మొదలైన వేట… తెలుగులో ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ మిస్ కావద్దు

గాల్లోనే ప్రాణాంతక వైరస్ దాడి.. ప్రపంచం మొత్తం భయపడిన ఏవియేషన్ డిజాస్టర్ థ్రిల్లర్ తెలుగులో

పుస్తకంలో రాసిన పాత్రలు నిజంగా బయటకొస్తే ? తర్వాత జరిగింది చూస్తే నవ్వాపుకోలేరు

Big Stories

Advertisement
×