E-Paper
Advertisement

ఒక్క దెబ్బతో అందరినీ లేపేయొచ్చు.. ఇరాన్ వీధుల్లో ట్రంప్ షాకింగ్ కామెంట్స్!

ఒక్క దెబ్బతో అందరినీ లేపేయొచ్చు.. ఇరాన్ వీధుల్లో ట్రంప్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నోట ఎప్పుడూ ఊహించని సంచలనాలే వస్తుంటాయి. అంతర్జాతీయ దౌత్య నీతిని పక్కనబెట్టి ఆయన చేసే కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమాసియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇరాన్ అగ్ర నాయకత్వమంతా ఒకే చోట చేరిన తరుణంలో, అమెరికా తలుచుకుంటే ‘ఒక్క దెబ్బతో’ అందరినీ తుడిచిపెట్టగలదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆ ఒక్క దెబ్బతో అందరూ క్లోజ్.. కానీ!
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘యాక్సియోస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఖమేనీ అంత్యక్రియల కోసం ఇరాన్ టాప్ లీడర్లంతా ఒకే వేదికపైకి వచ్చారని, ఒకే ఒక్క దాడితో వారందరినీ లేపేయొచ్చని వ్యాఖ్యానించారు. అయితే తాము ఆ పని చేయడం లేదని, ఒకవేళ అందరినీ ఖతం చేస్తే భవిష్యత్తులో శాంతి చర్చలు జరపడానికి అవతలి వైపు ఇంకెవరూ మిగలరని ఎద్దేవా చేశారు. ప్రస్తుతానికి అంత్యక్రియల దృష్ట్యా ఇరు దేశాల మధ్య దాడులు జరగకుండా వారం రోజుల పాటు విరామం ప్రకటించామని, ఒక ఒప్పందం కోసం ఇరాన్ నేతలే ప్రాధేయపడుతున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

Advertisement

నకిలీ కన్నీళ్లు.. ట్రంప్ ఆశ్చర్యం!
ఖమేనీ మరణంతో ఇరాన్ వీధుల్లోకి పోటెత్తిన జనాలను చూసి తాను షాకయ్యానని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడి ప్రజలు ఖమేనీని తీవ్రంగా ద్వేషిస్తారని తాను భావించానని, కానీ టీవీల్లో చూస్తే జనాలు ఏడుస్తూ కనిపించారని అన్నారు. అయితే ఆ కన్నీళ్లు బహుశా ‘నకిలీవి’ లేదా బలవంతపు ప్రదర్శన అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అమెరికాతో ఇరాన్ శత్రుత్వాన్ని పెంచుకున్న నేపథ్యంలో, ఖమేనీ మరణాన్ని అక్కడి ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారనే దానిపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

నాగరికత లేనివాడివి.. ఇరాన్ ఘాటు కౌంటర్!
ట్రంప్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇరాన్ వర్గాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా (X) వేదికగా ట్రంప్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. “మీకు కనీస నాగరికత, చరిత్రపై అవగాహన, పక్కవారి పట్ల గౌరవం ఏమాత్రం లేవు.. అందుకే మీకు ఈ సెంటిమెంట్లు అర్థం కావు” అంటూ ఘాటుగా స్పందించింది. మరోవైపు ఇరాన్ సైనిక కమాండర్ అలీ అబ్దుల్లాహి స్పందిస్తూ.. ఇరాన్‌పై ఎలాంటి చిన్న దుశ్చర్యకు పాల్పడినా, అమెరికా-ఇజ్రాయెల్‌లకు తమ సాయుధ దళాల నుంచి ఊహించని ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.

Advertisement

టార్గెట్‌లో ఖమేనీ కుమారుడు.. పశ్చిమాసియాలో హైటెన్షన్!
ఇదిలా ఉంటే, ఖమేనీ వారసుడిగా భావిస్తున్న ముజ్తబా ఖమేనీని కూడా తాము హతమారుస్తామంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా స్పందిస్తూ, తమ నాయకత్వానికి ఎలాంటి ముప్పు వచ్చినా తక్షణమే శక్తిమంతమైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, భద్రతా కారణాల దృష్ట్యా ముజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొనడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంత్యక్రియల ఊరేగింపులు ఇరాన్‌లో కొనసాగుతుండగా, ఈ నెల 9న ఆయన స్వస్థలమైన మషద్‌లో ఇవి ముగియనున్నాయి.

Also Read: మనుషులపై విరుచుకుపడ్డ రోబో.. క్లైమాక్స్‌లో బ్రూస్‌ లీ రేంజ్ పోజ్.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్!

Related News

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం.. భారత్ ఫార్మా కంపెనీపై డ్రోన్ల దాడి, రూ.400 కోట్ల నష్టం!

తీగలాగితే డొంక కదిలింది.. ప్లైదుబాయ్ కో-పైలట్ గురించి షాకింగ్ విషయాలు, ఇకపై ఇజ్రాయెల్..

భారత్ కెప్టెన్ మచ్చర్‌కి ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ వీడియో కాల్.. డోర్ తీసే సమయంలో..

‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా’.. ఎలాన్ మస్క్ సడెన్ బ్రేకప్‌పై.. శివోన్ జిలిస్ తీవ్ర భావోద్వేగం!

ఫ్లైదుబాయ్ దాడి ఘటన.. కో-పైలెట్ వెనుక ఉగ్రకోణం.. వెలుగులోకి సంచలన నిజాలు!

మాపై దాడికి తెగిస్తే అణ్వాయుధాలే.. నాటో దేశాలకు పుతిన్ ఘాటు వార్నింగ్!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

Big Stories

Advertisement
×