E-Paper
Advertisement

Attack on Amazon Data Centre: అమెజాన్ క్లారిటీ.. గల్ఫ్‌లో డేటా సెంటర్లపై దాడులు నిజమే, కాకపోతే

Attack on Amazon Data Centre: అమెజాన్ క్లారిటీ.. గల్ఫ్‌లో డేటా సెంటర్లపై దాడులు నిజమే, కాకపోతే
Advertisement

Attack on Amazon Data Centre: ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత గల్ఫ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్‌ దాడులు తీవ్రతరం చేసింది. ముఖ్యం గా అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్లపై దాడి జరిగింది. ఈ విషయమై వార్తలు జోరందుకోవడంతో ఆ సంస్థ  క్లారిటీ ఇచ్చింది.

గల్ఫ్‌లో డేటా సెంటర్లపై దాడులు నిజమే.. అమెజాన్ క్లారిటీ

Advertisement

ఇరాన్‌పై అమెరికా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారు. ఫలితంగా రకరకాల సేవలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఎట్టకేలకు ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. యూఏఈ, బహ్రాయిన్‌లోని రెండు డేటా సెంటర్లపై డ్రోన్లు దాడి  జరిగిందని తెలిపింది.

పశ్చిమాసియాలో పలుచోట్ల క్లౌడ్ సర్వీసులకు అంతరాయం కలిగిందని పేర్కొంది. అయితే సర్వీసుల పునరుద్ధరణకు స్థానిక అధికారులతో కలిసి సిబ్బంది పని చేస్తున్నట్లు తెలియజేసింది. ముఖ్యంగా బహ్రెయిన్‌లో డేటా సెంటర్‌ ప్రాంగణంలో జరిగిన దాడి వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్రనష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఉద్యోగులు ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు సదరు సంస్థ.

Advertisement

యూఏఈ-బహ్రాయిన్‌లో  రెండు డేటా సెంటర్లపై దాడులు

ప్రభావిత జోన్‌లో కనెక్టివిటీని పునరుద్ధరించడానికి చాలా గంటలు పడుతుందని తెలిపింది. యుఏఇలోని ఇతర జోన్‌లు సాధారణంగా పని చేస్తున్నాయని డేటా సెంటర్ ఆపరేటర్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితి కంటిన్యూ అయితే సర్వీసు అందించడం కష్టమనే అభిప్రాయాన్ని సూచనప్రాయంగా చెప్పుకొచ్చింది.

కంప్యూటింగ్, డేటా స్టోరేజ్, డేటాబేస్ సేవలు టెక్ యుగంలో అత్యంత కీలకమైనవిగా మారాయి. ఈ సేవలపై ఆధారపడిన సంస్థలు తమ డేటాను బ్యాకప్ చేసుకోవాలని సూచన చేసింది. రికవరీ పనులు కొనసాగుతున్నప్పుడు కొంత అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. ఒకప్పుడు చమురు క్షేత్రాలు, విద్యుత్ ప్లాంట్లను యుద్ధం సమయంలో టార్గెట్ అయ్యేవి. డిజిటల్ సేవలు జోరందుకున్న ప్రస్తుత రోజుల్లో డేటా సెంటర్లు సైతం కీలకంగా మారాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్‌లోని విమానాశ్రయాలు, ఓడరేవులు, నివాస ప్రాంతాలను డ్రోన్లు తాకిన విషయం తెల్సిందే.

ALSO READ: హోర్మోజ్ జల సంధి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. వస్తే పేల్చేస్తామని ఇరాన్ వార్నింగ్

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×